తాంసి, ఏప్రిల్ 17 : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బోథ్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్ ఆదేశాలతో వరంగల్‌లో ఈ నెల 27వ తేదీన నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ నాయకుడు కౌడాల మహేందర్ పిలుపునిచ్చారు. సమావేశం నిర్వహించారు. మండల వ్యాప్తంగా వాల్‌రైటింగ్ కార్యక్రమాలు చేపట్టారు. రజతోత్సవ సభ విజయవంతం కావాలన్న లక్ష్యంతో మండలంలోని ప్రతి గ్రామంలో ప్రచార కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. మండల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సభకు హాజరై బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. వారి వెంట బీఆర్ఎస్ నాయకుడు అశోక్, కార్యకర్తలు ఉన్నారు.
బాసర, ఏప్రిల్ 17 : వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27వ తేదీన నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభను వియవంతం చేయాలని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కోర్వ శ్యామ్ పిలుపునిచ్చారు. ఈ సభ విజయవంతం అయ్యేలా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు. ఆయా కాలనీల్లో వాల్‌రైటింగ్ వేశారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
తానూర్, ఏప్రిల్ 17 : వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27వ తేదీన లక్షలాది మందితో నిర్వహించే రజతోత్సవ సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ నాయకురాలు పడకంటి రమాదేవి పిలుపునిచ్చారు. గురువారం నిర్మల్ జిల్లా తానూర్ మండలంలోని హంగిర్గా గ్రామంలో పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి గ్రామం నుంచి వరంగల్ సభకు పెద్దసంఖ్యలో హాజరుకావాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకుడు విష్ణువర్ధన్‌రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.