జన్నారం/కోటపల్లి/బెల్లంపల్లి/చెన్నూర్/మందమర్రి/కాగజ్నగర్ఆసిఫాబాద్ అంబేద్కర్ చౌక్, సెప్టెంబర్ 17 : రాష్ట్ర సచివాలయం ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిష్ఠించాల్సిన చోట కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై బీఆర్ఎస్ శ్రేణులు, తెలంగాణ వాదుల్లో ఆగ్రహం వ్యక్తమైంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మంగళవారం మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకాలు చేశారు. తెలంగాణ తల్లిని అవమానిస్తారా అంటూ కాంగ్రెస్ సర్కారుపై మండిపడుతూ ఊరూరా నిరసనలు చేపట్టారు. జన్నారం మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి బీఆర్ఎస్ నాయకుడు, మాజీ జడ్పీటీసీ ఎర్ర చంద్రశేఖర్, కో ఆప్షన్ సభ్యుడు మున్వర్అలీఖాన్, జిల్లా అధికార ప్రతినిధి సిటిమల భరత్‌కుమార్ పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రంలో ప్రధాన కార్యదర్శి సులువ జనార్దన్, మాజీ వైస్ చైర్మన్ సుతారి వినయ్, సింగిల్ విండో చైర్మన్ నాసాని రాజన్న, నాయకులు ఫజల్‌ఖాన్, బాలసాని శ్రీనివాస్‌గౌడ్,బోర్లకుంట ప్రభుదాస్, లెక్కల మల్లయ్య, జంగం రవి, వోలాల నర్సాగౌడ్ పాల్గొన్నారు. కోటపల్లిలోని తెలంగాణ చౌక్‌లో బీఆర్ఎస్ నాయకులు కొట్టె నారాయణ, రాళ్లబండి శ్యామ్ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లికి క్షీరాభిషేకం చేశారు.
బెల్లంపల్లి పట్టణంలోని పాతబస్టాండ్ వద్ద తెలంగాణ తల్లి విగ్రహానికి మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్ కో ఆప్షన్ సభ్యుడు వాజిద్, బీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి రేవెల్లి విజయ్, ఉపాధ్యక్షుడు సత్యనారాయణ, రెండో వార్డు అధ్యక్షుడు సబ్బని అరుణ్‌కుమార్, నాయకులు సాజిద్, ఖదీర్, శ్రీను, మహేశ్, సురేశ్, చరణ్, మధు పాల్గొన్నారు. చెన్నూర్‌లో బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి నాయకులు రాజా రమేశ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లెల దామోదర్‌రెడ్డి, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ నవాజుద్దీన్, కౌన్సిలర్లు రేవెల్లి మహేశ్, జోడు శంకర్, దోమకొండ అనిల్, జగన్నాథుల శ్రీను, కో-ఆప్షన్ సభ్యుడు అయూబ్, మాజీ ఎంపీపీ మంత్రి బాపు, బీఆర్ఎస్ నాయకులు రాంలాల్ గిల్డా, మేడ సురేశ్‌రెడ్డి, అయిత సురేశ్‌రెడ్డి, శ్రీనివాస్, రత్న సమ్మిరెడ్డి, ఆరీఫ్, నాయిని సతీశ్, రాజారాం తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేశారు. మందమర్రి పట్టణంలోని పాతబస్టాండ్ చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ తల్లి చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. బీఆర్ఎస్ చెన్నూర్ నియోజకవర్గ నాయకుడు డాక్టర్ రాజారమేశ్, పట్టణ అధ్యక్షుడు జే.రవీందర్, టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్, బీఆర్ఎస్, టీబీజీకేఎస్ సీనియర్ నాయకులు బండారు సూరిబాబు, కొంగల తిరుపతి రెడ్డి, బోరిగం వెంకటేశ్, రాజశేఖర్, ఎండీ అబ్బాస్, భూపెల్లి కనకయ్య, భట్టు రాజ్‌కుమార్, సీపెల్లి సాగర్ పాల్గొన్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పాలాభిషేకం చేశారు. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తరతరాలుగా తెలంగాణ రాష్ర్టాన్ని అడ్డుకుంటూ వచ్చిందని, కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతో కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ లెండుగూరే వ్యాంరావు, నాయకులు నక్క మనోహర్, రాజ్‌కుమార్, రాజ్‌కుమార్ పాల్గొన్నారు.
సీసీసీ నస్పూర్, సెప్టెంబర్ 17 : అసెంబ్లీ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సిన చోట రాజీవ్‌గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడం దారుణమని, ఇది తెలంగాణ ప్రజలను అవమానించడమేనని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు. నస్పూర్‌లోని తెలంగాణ తల్లి విగ్రహానికి పార్టీ శ్రేణులతో కలిసి పాలాభిషేకం చేశారు. దివాకర్‌రావు మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి మొండిగా వ్యవహరిస్తూ పాలన సాగిస్తున్నారని, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని కుట్ర పన్నుతున్నాడని మండిపడ్డారు. ప్రజా సమస్యలు పక్కనబెట్టి పంతాలకు పోతున్నారని, అధికారంలో ఉన్నామని కక్ష రాజకీయాలు చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. తెలంగాణ తల్లికి జరిగిన అవమానాన్ని మేధావులు, తెలంగాణవాదులు, ఉద్యమకారులు ఖండించాలని పిలుపునిచ్చారు. కౌన్సిలర్లు కుర్మిళ్ల అన్నపూర్ణ, జబీన్హైమద్, నాయకులు పానుగంటి సత్తయ్య, దగ్గుల మధు, కాటం రాజు, జాడి భానుచందర్, జక్కుల కుమార్, రఫీక్‌ఖాన్, తోట దుర్గాప్రసాద్, ఆకునూరి సంపత్‌కుమార్, అమృత రాజ్‌కుమార్, గర్శె భీమయ్య, మాడుగుల స్వామిదాస్, ముక్కెర వెంకటేశ్, బానోత్ రాజునాయక్, బండారి తిరుపతి, అడ్లకొండ రవిగౌడ్ పాల్గొన్నారు.