ఎదులాపురం, అక్టోబర్ 13 : ‘బూటకపు హామీలతో అన్నదాతలను, సామాన్య ప్రజానీకాన్ని మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను క్షేత్రస్థాయిలో ఎండగట్టాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆదిలాబాద్ నియోజకవర్గ నేతలతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గ్గొని మాట్లాడారు. సీఎం రేవంత్ అసమర్థ పాలనలో ప్రజలు ఇబ్బందులు ఎదురొంటున్నారని మండిపడ్డారు. రైతుల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఈనెల 24వ తేదీన జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వస్తున్నారని, ఈ నేపథ్యంలో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, ప్రజల ఇకట్లు, రైతులకు ఇచ్చిన హామీల వంటి అంశాలపై దిశానిర్దేశం చేస్తారని పేరొన్నారు. కేసీఆర్ స్ఫూర్తితో మరోసారి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉద్యమానికి సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు.
వంటి ఆరు హామీలకు చట్టబద్ధత కల్పిస్తామన్న రేవంత్ హామీలను బుట్టదాఖలు చేస్తున్నారని మండిపడ్డారు. మహిళలకు పెన్షన్, పెన్షన్ పెంపు వంటి హామీలను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. కేసీఆర్ హయాంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభమైతే.. ఉద్యోగం సాధించిన వారికి నియామక పత్రాలు అందచేసి తామే నోటిఫికేషన్లు జారీ చేసినట్లు గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. కేటీఆర్ హాజరు కానున్న సమావేశానికి రైతులు, రైతు కూలీలు, శ్రేణులు భారీ సంఖ్యలో హాజరై, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రోకండ్ల రమేశ్, అజయ్, ఇజ్జగిరి నారాయణ, రౌతు మనోహర్, యూనిస్ అక్బాని, గండ్రత్ రమేశ్, సాజిదొద్దీన్, సలీం, ప్రమోద్‌రెడ్డి, సతీష్ పవర్, లింగారెడ్డి, మార్చెట్టి గోవర్ధన్, గండ్రత్ రమేశ్, కొముర రాజు, బొడగం మమత, సేవ్వా జగదీశ్, గంగయ్య పాల్గొన్నారు.