చెన్నూర్, మే 14 : పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కోసం కష్టపడిన శ్రేణులు, ఓటర్లకు ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు.
బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ రోడ్ షోలను విజయవంతం చేశారని, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు పార్టీ గెలుపు కోసం అహర్నిశలు, శక్తి వంచన లేకుండా కృషి చేశారని, వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామని పేర్కొన్నారు.