ఎదులాపురం, నవంబర్ 20: సీఎం కేసీఆరే తెలంగాణ ప్ర జలకు అండగా ఉండగలరని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జో గు రామన్న అన్నారు. ఆదిలాబాద్ ఏసీ మెకానిక్ యూనియన్ సభ్యులు, పాన్ షాప్ అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యే జోగు రామన్న నాయకత్వానికి జై కొట్టారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన చేరికలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు పార్టీలో చేరిన 400 మందికి గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు.
ఈ సందర్భం గా ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ.. బీజేపీలా ప్రజలపై భారం మోపే పార్టీ బీఆర్ఎస్ కాదని, పేద బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండే కారు గుర్తు పార్టీ అని పేర్కొన్నారు. ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి, తనను మరోసారి గెలిపించాల ని కోరారు. మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, పట్టణ కార్యదర్శి అష్రప్, సీనియర్ నాయకుడు యూనిస్ అక్బాని, కో ఆప్షన్ సభ్యుడు ఏజాజ్, తదితరులున్నారు.
రానున్న ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల డిపాజిట్ గల్లంతవు తుందని బీఆర్ఎస్ మహిళా విభాగం పట్టణాధ్యక్షురాలు స్వ రూపారాణి అన్నారు. ప్రచారంలో భాగంగా సోమవారం జి ల్లా కేంద్రంలోని వార్డు నంబర్ 28 కోలిపూర, బొక్కలగూడ లో బీఆర్ఎస్ వార్డు ఇన్చార్జి, వా ర్డు కౌన్సిలర్ పండ్ల శ్రీని వాస్‌తో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వ హించారు. కారు గుర్తు కు ఓటేసి, ఎమ్మెల్యే అభ్యర్థి జోగు రా మన్నను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి బొడగం మమత, పట్టణ కార్యదర్శి కరుణ, కార్యక ర్తలు సంగీత, సురే ఖ, గంగామణి, అంజలీ, లక్ష్మి, జ్యోతి, శోభ తదితరులున్నారు.
ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యే అభ్యర్థి జోగు రామన్నను భారీ మెజార్టీతో గెలిపించి మరింత అభివృద్ధికి సహకరించాలని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేంద ర్ అన్నారు. ప్రచారంలో భాగంగా సోమవారం జిల్లా కేంద్రం లోని కుమ్మర్పేట్, మోచిగల్లిలో వార్డు ఇన్చార్జి యూనిస్ అ క్బానీతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రజల సం క్షేమం కోసం సీఎం కేసీఆర్ విడుదల చేసిన మ్యానిఫెస్టోను ఇం టింటికీ తిరుగుతూ వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆసరా పింఛన్, కేసీఆర్ బీమా పథకం, పెట్టుబడి సాయం పెంపు, తదితర పథకాలపై వివరించారు. వచ్చే ఎన్నికల్లో ఆదిలాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థిగా జోగు రా మన్నను ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మాజీ వార్డు కౌన్సిలర్ ఏ.శ్రీదేవి, ఐసీడీఎస్ మాజీ ఆర్గనైజర్ కస్తాల ప్రేమల, నాయకులు సృజన్, ప్రకాశ్, ఫిరోజ్, సలీం త దితరులున్నారు.
జైనథ్, నవంబర్ 20: కాంగ్రెస్, బీజేపీ మోసపూరిత మాటలు చెబుతున్నాయని, నమ్మితే ఆగం చేస్తారని ఆదిలాబాద్ ఎమ్మె ల్యే జోగు రామన్న అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బేల మండలంలో ఎమ్మెల్యే జోగు రామన్న విస్తృత పర్యటన చేశారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిశారు. మొదట గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే జోగు రామన్నకు మంగళహారతులతో స్వా గ తం పలికి డప్పు చప్పుళ్ల మధ్య ఘన స్వాగతం పలికారు. ఎ మ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ ప్రజానీకానికి ఎలాంటి సంక్షేమం అందించకుండా 72 ఏళ్లు పాలించిన బీజేపీ, కాంగ్రె స్ ఏ ముఖం పెట్టుకొని గ్రామాల్లో ఓట్లు అడగడానికి వస్తారని ఎమ్మెల్యే జోగు రామన్న ధ్వజమెత్తారు.
బేల మండలాభి వృద్ధి లో భాగంగా ఆదిలాబాద్ పట్టణం నుంచి బేల వరకు రూ.వేల కోట్లు వెచ్చించి రోడ్డు అభివృద్ధి చేయడం జరిగిందని, నాడు నానా అవస్థలు ఎదుర్కొన్న ప్రయాణికులు నేడు సులభతరం గా ప్రయాణాన్ని చేసుకోగలుగుతున్నారన్నారు. కాంగ్రెస్, బీ జేపీ నాయకులు రైతుల పట్ల అమానుషంగా ప్రవర్తించారన్నా రు. మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గెలిపించుకొని ఎమ్మె ల్యే అభ్యర్థి జోగు రామన్నను బలపర్చాలని కోరారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ రౌతు మనోహర్, బేల మండలాధ్యక్షుడు ప్రమోద్ రెడ్డి, సతీశ్ పవార్, గంభీర్ ఠాక్రే, విపిన్, తన్వీర్ ఖాన్, సునీల్, ఇం ద్రశేఖర్ పాల్గొన్నారు.
జైనథ్, నవంబర్ 20: బీజేపీ చేస్తున్న మోసాలను యువకులు గ్రహిస్తున్నారని, గ్రూప్-1, గ్రూప్-2 పేపర్ లీకేజీలో బీజేపీ నాయకులు ఫొటోలతో సహా దొరికిపోయారని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. సోమవారం జైనథ్, బేల మండలాల్లోని జామిని, కారా గ్రామాలకు చెందిన యువకులు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే జోగు రామన్న కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్, నాయ కు లు కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎదులాపురం,నవంబర్ 20: జిల్లా కేంద్రంలోని రవీందర్నగ ర్, హౌసింగ్‌బోర్డ్, గాంధీనగర్‌లో సోమవారం బీఆర్ఎస్ పార్టీ మహిళా కార్యకర్తలు ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేపట్టా రు. ప్రభుత్వ పథకాలు అమలు గురించి తెలియజేస్తూ రేషన్ షాపులో సన్నబియ్యం, రూ.5లక్ష బీమా, రూ.6వేలు దివ్యాం గులకు, రూ.5వేలు వృద్ధాప్య పింఛన్ ఇవ్వడంతో పాటు సౌభా గ్యలక్ష్మి పథకం కింద రూ.3వేలు ఇవ్వడం జరుగుతుందన్నా రు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కారు గుర్తు ఎమ్మెల్యే అభ్యర్థి జో గు రామన్నకు ఓటేసి గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ దేశెట్టి ప్రభావతి, జోగు రమణి, ఫ్లోర్ లీడర్ బండారి సతీశ్, మహిళా నాయకురాళ్లు బండారి అనూష, అ త్యం ఆశమ్మ, కొప్పుల రాణి, అబ్బడి సరిత, జల్లెల జీవిత, లా వణ్య, స్వప్న, సంధ్య, సుధా, విమల కాలనీవాసులు ఉన్నారు.