కోటపల్లి, డిసెంబర్ 1 : వసతి గృహాల నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే గురుకుల బాట కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నరని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారిశెట్టి విద్యాసాగర్ మండిపడ్డారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మే రకు ఆదివారం గురుకుల బాట నిర్వహించగా, గురుకుల బాట ఇన్చార్జి చెన్నమల్ల చైతన్య, బీఆర్ఎస్వీ మంచిర్యాల జిల్లా అ ధ్యక్షుడు బడికెల శ్రావణ్, శ్రేణులతో కలి సి పాల్గొన్నారు. మొదట కోటపల్లి ఆశ్రమ పాఠశాల సందర్శనకు వెళ్లగా ప్రధాన ద్వా రం తెరవకపోవడంతో బీఆర్ఎస్వీ నాయకులు వెనుతిరిగారు.
అక్క డి నుంచి కోటపల్లిలోని ఎస్సీ వసతి గృహానికి వెళ్తుండ గా, ఎస్ఐ రాజేందర్ ఆధ్వర్యంలో పోలీసులు అడ్డుకున్నారు. ఎస్సీ హాస్టల్ ప్రధా న ద్వారం ముందే బీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగగా, కొంతమందిని మా త్రమే లోపలికి అనుమతించారు. నాయకులు విద్యార్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. వసతి గృహం శిథిలావస్థకు చేరిందని, విద్యార్థులకు సరిప డా మరుగుదొడ్లు లేవని, విద్యార్థులు అ సౌర్యాల నడుమ ఉం టున్నా సర్కారు ప ట్టించుకోవడం లేదని బీఆర్ఎస్వీ నాయకులు మండిపడ్డారు. వసతి గృహాలపై సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్లే విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించ డం లేదని ఆరోపించారు.
కుళ్లిపోయిన కూరగాయలతో భోజనం పెట్టడం వల్ల వి ద్యార్థులు అస్వస్థతకు గురై మరణిస్తున్నారన్నారు. బాలికల వసతి గృహాల్లో మహి ళా సిబ్బందినే నియమించాలని, రాత్రి పూట పురుషులైన ఉపాధ్యాయులు బస చేయకుండా చర్యలు తీసుకోవాలని డి మాండ్ చేశారు. ప్రతి హాస్టల్లో ఇన్వర్టర్లతో పాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చే సి పర్యవేక్షించాలన్నారు. ఈ కార్యక్రమం లో నాయకులు చందు, అనిల్, రాజ్‌కుమార్, పవన్, నూతన్ పాల్గొన్నారు.
Adilabad3