కాగజ్‌నగర్, ఫిబ్రవరి 9 : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేదోడిని కొట్టి పెద్దోడికి పెడుతున్నాడని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. సోమవారం ఆయన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్‌నగర్‌లో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. అధికారంలోకి వచ్చి రెండేండ్లు గడిచినా అభివృద్ధి చేయడం చేతకాని సీఎం ఎన్నికల ముందు ఫోన్ ట్యాపింగ్ కేసు తెచ్చి ప్రజల దృష్టి మళ్లిస్తున్నారని మండిపడ్డారు.
బీఆర్ఎస్ హయాంలో పట్టణాలు, పల్లెలు ఎంతో అభివృద్ధి చెందాయని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే కోనప్ప మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రెండేండ్లలో చేసిందేమీ లేదన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్య ర్థులను గెలిపించాలని కోరారు.