గులాబీ జెండా ఎగరేస్తాం
జగిత్యాల, రాయికల్ మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగురవేస్తామని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్ రమణ ధీమా వ్యక్తం చేశారు. జగిత్యాలలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని ఎన్నికల ప్రచారంలో ప్రజల ముందుంచామని, అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టామన్నారు. ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ ప్రచారానికి అపూర్వ స్పందన లభించిందని తెలిపారు.
- జగిత్యాల, రాయికల్లో మెజారిటీ సీట్లు సాధిస్తాం
- ఎమ్మెల్సీ ఎల్ రమణ
జగిత్యాల, ఫిబ్రవరి 9 : జగిత్యాల, రాయికల్ మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగురవేస్తామని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్ రమణ ధీమా వ్యక్తం చేశారు. జగిత్యాలలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని ఎన్నికల ప్రచారంలో ప్రజల ముందుంచామని, అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టామన్నారు. ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ ప్రచారానికి అపూర్వ స్పందన లభించిందని తెలిపారు.
కాంగ్రెస్, బీజేపీ ఇచ్చిన హామీలను విస్మరించాయని, గులాబీ సైనికులకే ప్రజలు పట్టం కట్టబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. జగిత్యాల అభివృద్ధిపై వైరల్ అవుతున్న వీడియోలు బీఆర్ఎస్ హయాంలో చేసినవేనని, రెండేళ్లలో అకడకడా సీసీ రోడ్లు తప్ప చేసిందేమీ లేదన్నారు. ప్రశ్నించే గొంతుకలకు ఓటేయబోతున్నారని తెలిపారు. మెడికల్, నర్సింగ్ కళాశాల, మాతా శిశు కేంద్రం, చింతకుంట చెరువు అభివృద్ధి ఘనత బీఆర్ఎస్దేనన్నారు. 4520 డబుల్ బెడ్రూం ఇండ్లు కేసీఆర్ ఇచ్చినవేనని గుర్తు చేశారు.
అంతా మంచే జరగాలని ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు దావ సురేశ్, ఎల్ కార్తికేయ, పట్టణాధ్యక్షుడు అయిల్నేని వెంకటేశ్వర్రావు, ప్రధాన కార్యదర్శి అల్లాల ఆనంద్ రావు, మాజీ జడ్పీటీసీ కొలుముల రమణ, శీలం ప్రవీణ్, ఆసీఫ్, అనంతుల గంగారెడ్డి, పడిగెల గంగారెడ్డి, ఎండబెట్ల ప్రసాద్, వొళ్ళాల గంగాధర్, వనమాల నిరంజన్, కుడిక్యాల సర్వేశ్వర్, అజ్ఘర్ ఖాన్, వసీం, గంగిపెల్లి శేఖర్ పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jobs | సెంట్రల్ వేర్హౌసింగ్ కార్పొరేషన్లో 327 అసిస్టెంట్ మేనేజర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఖాళీలు
Weight Loss | ఆహారాన్ని ఎక్కువగా తింటూనే బరువును తగ్గించుకోవచ్చా.. అది సాధ్యపడుతుందా.. ఎలా..?
Greater Noida: రాత్రి నూడుల్స్ తిన్నారు.. కుటుంబంలోని అయిదుగురు మృతి
Masoud Pezeshkian | మేం అణ్వాయుధాల కోసం ప్రయత్నిస్తున్నామనేది పచ్చి అబద్ధం : ఇరాన్ అధ్యక్షుడు
Chittem Rammohan Reddy | రైతు భరోసా అందని రైతుకు భరోసా ఎవరు..?.. కాంగ్రెస్ సర్కారుపై మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి నిప్పులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

