కడెం, డిసెంబర్ 12 : సమస్యలపై అసెంబ్లీలో ప్రశ్నించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ నాయకులు కోరారు. తెలంగాణ భవన్లో కేటీఆర్‌ని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నేతలపై పోలీసులు అక్రమంగా కేసులు పెడుతున్నారని తెలిపారు.
ఉమ్మడి జిల్లా పెండింగ్ అంశాలను కేటీఆర్ దృష్టికి తీసుకవెళ్లినట్లు నేతలు తెలిపారు. కేటీఆర్‌ను కలిసిన వారిలో మాజీ మంత్రి జోగు రామన్న, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్, జిల్లా సమన్వయకర్త రాంకిషన్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ లోలం శ్యాంసుందర్ పాల్గొన్నారు.