కడెం, జూలై 12 : తొమ్మిదేళ్ల కాలంలో రైతులకు బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక వసతులు కల్పిస్తే జీర్ణించుకోలేని కాంగ్రెస్ రైతులకు ఉచిత విద్యుత్ అవసరం లేదని మాట్లాడడం సిగ్గుచేటని బీఆర్ఎస్ నాయకులు, రైతులు మండిపడ్డారు. బుధవారం కడెంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బీఆర్ఎస్ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. కాంగ్రెస్, రేవంత్‌రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు జొన్నల చంద్రశేఖర్ మాట్లాడారు. రైతులకు కేవలం మూడు గంటలు మాత్రమే విద్యుత్ సరిపోద్ది అని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు చేయడం విడ్డురంగా ఉంద ని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ రైతు వ్యతిరేక పార్టీ అని, వ్యవసాయం గురించి తెలియని రేవం త్‌రెడ్డి ఇష్టం ఉన్నట్లు మాట్లాడుతున్నారని ఆరోపిం చారు. సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు గొళ్ల వేణుగోపాల్, ఆత్మ చైర్మన్ కానూరి సతీశ్, నాయ కులు కొండాపురం లక్ష్మణ్, జడ ఇందూర్ నేత, కుర్ర లక్ష్మణ్, ఎండీ హాసీబ్, బొర్లకుంట రాజేశ్, నల్లగొండ, చిటేటి ముత్తన్న, ఎండీ షర్పొద్దీన్, సపావత్ రవి, కత్తెరపాక శేఖర్, జాడి గంగాధర్, మనోహర్, రమేశ్ నాయక్, వేణుగోపాల్ నాయ క్, నేరేళ్ల నరేశ్, వెంబడి శేఖర్, వెంకటేశం, రాజు, గంగేశ్వర్, రాజ్‌కుమార్, నర్సయ్య, సత్యనారా యణ, తదితరులు పాల్గొన్నారు.
ఖానాపూర్‌లో..
ఖానాపూర్ జూలై 12 : ఉచిత కరెంటుపై అను చిత వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడి దిష్టిబొమ్మను బుధవారం తెలంగాణ చౌక్ వద్ద బీఆర్ఎస్ నాయకులు దహనం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక పార్టీ అని మండిపడ్డారు. కాంగ్రెస్ అధి కారంలో ఉన్నప్పుడు రైతులకు ఏనాడు కూడా మూడు గంటల విద్యుత్ ఇచ్చిన చరిత్ర లేదన్నా రు. రేవంత్ రెడ్డి రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీజీవో మాజీ జిల్లా అధ్యక్షుడు శ్యాంనాయక్, మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజగంగన్న, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గొర్రె గంగధర్, నాయకులు అకుల వెంకగౌడ్, పత్రి నగేశ్, ద్యావతి రాజేశ్వర్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
దస్తురాబాద్‌లో..
దస్తురాబాద్, జూలై 12 : రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను బుధవారం దస్తురాబాద్‌లో బీఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో దహనం చేశారు. మండల కేంద్రంలో నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ముడికె ఐలయ్యయాదవ్, ప్రధాన కార్యదర్శి అర్గుల రాజనర్సయ్య, జడ్పీటీసీ శారదాశ్రీనివాస్, సర్పంచ్‌లు నిమ్మతోట రాజ మణి, శివయ్య, నగావత్ సురేశ్‌నాయక్, దీటి సుజాత సత్తన్న, రైతు బంధు సమితి అధ్యక్షుడు సిర్ప సంతోష్, నాయకులు లోక శరత్‌రెడ్డి, స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
పెంబిలో..
పెంబి, జూలై 12 : మండల కేంద్రంలో బీఆర్ ఎస్ నాయకులు, రైతులు రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ ను దహనం చేసి నిరసన చేశారు. రైతులకు వెంటనే క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. వైస్ ఎంపీపీ బైరెడ్డి గంగారెడ్డి, రైతు బంధు సమితి మండల కన్వీనర్ భూక్యా టీకాజీ, సర్పంచ్‌లు పూర్ణచందర్ గౌడ్, సుధాకర్, మహేందర్, నాయకులు కున్సోత్ విలాస్, గాండ్ల శంకర్, భూమగౌడ్, రమేశ్ రైతులు పాల్గొన్నారు.
ఉట్నూర్‌లో..
ఉట్నూర్, జూలై 12 : రైతులకు వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ అని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కందుకూరి రమేశ్ పేర్కొన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో రైతులకు 24 గంటల కరెంట్ అవసరం లేదని అహంకా రంగా మాట్లాడిన రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వచ్చాక రైతులపై లాఠీచార్జీలు లేవని, విత్తనాల కోసం క్యూలు లేవని పేర్కొన్నారు. సరైన సమయంలో విత్తనాలు రైతుబంధు అందుతుండడంతో రైతులు సంతోషంగా ఉంటే కాంగ్రెసోళ్లు చూడలేకపోతు న్నారన్నారు. అధికారంలోకి వస్తే ధరణి తీసేస్తా మంటున్నారని, 24 గంటల కరెంటు వద్దంటు న్నారని, ఇలాంటి నాయకులు మనకు అవసర మా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన సమసయంలో బుద్ది చెబుతారని పేర్కొ న్నారు. వైస్ ఎంపీపీ బాలాజీ, మాజీ జడ్పీటీసీ జగ్జీవన్‌రావు, పీఏసీఎస్ చైర్మన్ ప్రభాకర్, నాయ కులు సింగారే భరత్, పోషన్న, స్వామి, ఆశన్న, తదితరులు పాల్గొన్నారు.
రైతులకు క్షమాపణ చెప్పాలి
ఉట్నూర్ రూరల్, జూలై 12 : కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి రైతులకు క్షమాపణలు చెప్పాలని ఇంద్రవెల్లి మర్కెట్ కమిటీ చైర్మన్ శ్రీరాం జాదవ్ డిమాండ్ చేశారు. బుధవారం లింగోజితాండ ఎక్స్‌రోడ్ గ్రామంలో బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు ధరణి రాజేశ్, నాయకులతో కలిసి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా శ్రీరాం జాదవ్ మాట్లాడుతూ 50 ఏళ్లలో జరగని అభివృద్ధి 9 ఏడ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసి చూపించారని పేర్కొన్నారు. గతంలో పాలించిన కాంగ్రెస్ 24 గంటల కరెంటు ఎక్కడిచ్చారో తెలుపాలని డిమాండ్ చేశారు. రైతులను మోసం చేసి, తప్పుదోవ పట్టించి రాజకీయం చేయడం కాంగ్రెస్ నైజం అని పేర్కొన్నారు. స్థానిక సర్పంచ్ హరి నాయక్, జగన్, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు దాసండ్ల ప్రభాకర్, సంజీవ్, వినోద్, మాన్కు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయం
ఇంద్రవెల్లి, జూలై 12 : రేవంత్‌రెడ్డి వ్యాఖ్యల కు నిరసనగా మండలంలోని పాటగూడలో కోలాం ఆదివాసీ గిరిజనులు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని తీర్మానం చేశారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు భూక్యా జాన్సన్‌నాయక్ సమ క్షంలో ప్రమాణం చేశారు. పాటగూడ, ముత్నూ ర్, గలియబాయితండా, ఏమాయి కుంట, గిన్నెరా, బిక్కుతండా, కెస్లాగూడ గ్రామాలతో పాటు పలు గ్రామాల్లో బుధవారం జాన్సన్ నాయక్ తన అనుచరులతో కలిసి పర్యటించా రు. ముత్నూర్ గ్రామంలో రేవంత్‌రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేశారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతి రేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జాన్సన్ నాయక్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో మూడోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చేలా అందరం కృషి చేద్దామ న్నారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ది చెప్పాలన్నారు. వైస్ ఎంపీపీ పడ్వాల్ గోపాల్ సింగ్, మండల కోఆప్షన్ సభ్యుడు మీర్జా జిలానీ బేగ్, మాజీ కోఆప్షన్ సభ్యుడు ఎండీ మసూద్, ఇంద్రవెల్లి ఉపసర్పంచ్ టేహెరే గణేశ్, నర్వట్ల విజయ్‌కుమార్, నాయకులు జాదవ్ ప్రకాశ్, సత్యానంద్ పాల్గొన్నారు.