కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ) : యూరియా కొరతపై బీఆర్ఎస్ కన్నెర్ర చేసింది. రైతులతో కలిసి ఆందోళన బాట పట్టింది. సోమవారం పలుచోట్ల చేపట్టిన ధర్నాల్లో పాల్గొని సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేసింది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ సహకార కేంద్రం ముందు రైతులు చేపట్టిన ధర్నాలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి పాల్గొని మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యంతో నే రైతులు యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నార న్నారు.
వ్యవసాయ పనుల్లో బిజీగా ఉండాల్సిన సమయంలో యూరియా కోసం తిరగాల్సిన పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఇబ్బందులు పడుతుంటే సీఎం రేవంత్ రెడ్డికి కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు. పాలన చేతగాకపోతే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో ఏ ఒక్క రైతూ యూరియా కోసం ఇబ్బందులు పడలేదని, ఏ ఒక్క రోజూ ధర్నా చేసింది లేదన్నారు.
రైతుబంధు డబ్బులు, 24 గంటల ఉచిత కరెంటుతో రంది లేకుండా వ్యవసాయం చేసుకున్నారని గుర్తు చేశారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన త ర్వాత యూరియా బస్తాల కోసం చెప్పులు క్యూలో పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. రైతులకు యూరియా దొరుకుతుందనే నమ్మకం పోయిందన్నారు.
ఇప్పటికైనా మంత్రులు, అధికారు లు స్పందించి రైతులకు సరిపడా యూరియా తెప్పించాలని, లేదంటే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని ఆమె హెచ్చరించారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు మర్సుకోల సరస్వతి, సింగిల్ విండో చైర్మన్ అలీబిన్ అహ్మద్, నాయకులు జాబరి రవీందర్, అహ్మద్, బలరాం, నిస్సార్, లక్ష్మీన్, భీమేశ్, రాజ్‌కుమార్, శ్రీకాంత్, శ్రీను, రవి, కిట్టయ్య, మల్లయ్య, పెంటు, పోచన్న పాల్గొన్నారు.
రెబ్బెన పీఏసీఎస్ ఎదుట..
రెబ్బెన, ఆగస్టు 25 : రెబ్బెన మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) కార్యాలయం వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేశారు. నాయకులు, రైతులు మాట్లాడుతూ యూరియా కొరతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు.
ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ కార్నాథం సంజీవ్‌కుమార్, వైస్ చైర్మన్ రంగు మహేశ్‌గౌడ్, పార్టీ మండల అధ్యక్షుడు పొటు శ్రీధర్‌రెడ్డి, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ కుందారపు శంకరమ్మ, మాజీ వైస్ ఎంపీపీ గజ్జల సత్యనారాయణ, సోషల్ మీడీయా ఇన్చార్జి వినోద్‌జైస్వాల్, మాజీ కో ఆప్షన్ మెంబర్ జౌరొద్దీన్, నాయకులు సంగం శ్రీనివాస్, పందిర్ల మధునయ్య, తోట లక్ష్మణ్, వడై పోచం, దుర్గం భరద్వాజ్, బోమ్మినేని శ్రీధర్, మన్యం పద్మ, ఇంగు మల్లేశ్, బుర్స పోషమల్లు, అక్కేవార్ దయాకర్, కొడిపె వెంకటేశ్, ఇప్ప భీమయ్య ఉన్నారు.
జైనూర్‌లో మార్కెట్ గోదాం వద్ద
జైనూర్, ఆగస్టు 25 : మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ గోదాం వద్ద రైతులు, బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేపట్టారు. జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కనక యాదవరావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలిచ్చి ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ కోడప హన్నూపటేల్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఇంతియాజ్‌లాలా, ఉపాధ్యక్షుడు కొలాం శంకర్, ఎంపీటీసీల ఫోరం మాజీ మండల అధ్యక్షుడు కుమ్ర భగవంత్‌రావు, మాజీ సర్పంచులు గేడం లక్ష్మణ్, మెస్రం భీంరావు, శంకర్, నాయకులు సిద్ధార్థ సోన్‌కాంబ్లె, పూసం మారు, రైతులు, మహిళలు పాల్గొన్నారు.
సిర్పూర్(యూ)లో నిరసన
సిర్పూర్(యూ), ఆగస్టు 25 : సిర్పూర్(యూ) మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు, రైతులు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తొడసం ధర్మరావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలు హామీలిచ్చి రైతుల గొంతు కోసిందన్నారు. ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో లక్యానాయక్, ఆత్రం ఓంప్రకాశ్, కిషన్, అర్క నాగోరావు, కోవ నాందేవ్ ఉన్నారు.
కాగజ్‌నగర్‌లో రాస్తారోకో
కాగజ్‌నగర్, ఆగస్టు 25 : రైతులకు యూరియా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు మండిపడ్డారు. కాగజ్‌నగర్ పట్టణంలోని మార్కెట్ యార్డు సమీపంలో ప్రధాన రోడ్డుపై సోమవారం రైతులతో కలిసి ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సొసైటీ డైరెక్టర్లు, అధికారులు యూరియా కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్లో ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారని విమర్శించారు. పోలీసులు అక్కడికి చేరుకొని బలవంతంగా ధర్నా విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో రైతులు, నాయకులు ఉన్నారు.
వాంకిడిలో..
వాంకిడి, ఆగస్టు 25 : మండల కేంద్రంలోని సహకార సంఘ కా ర్యాలయం ఎదుట బీఆర్ఎస్ నాయకులు, రైతులతో కలిసి నిరసన తెలిపారు. వాంకిడి మాజీ జడ్పీటీసీ అజయ్ మాట్లాడుతూ యూరి యా కృత్రిమ కొరత సృష్టించి బయట రూ. 600 ఒక బస్తా అమ్ము తున్నారన్నారు.
కౌటాలలో..
కౌటాల, ఆగస్టు 25 : కౌటాల మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద బీఆర్ఎస్ నాయకులు సోమవారం ధర్నా చేశారు. రైతులకు యూరియా అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే పూర్తిగా విఫలమయ్యారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ మండల కన్వీనర్ బంధుపటేల్, మాజీ ఎంపీపీ బాసరర్ విశ్వనాథ్, నాయకులు రాంటెంకి నవీన్, యూత్ ప్రెసిడెంట్ కార్తీక్, కో కన్వీనర్ అదే నాందేవ్, నాయకులు ఆనంద్, గోగర్ల సాయికుమార్, మొతీరాం, ఆత్మారామ్, ముత్తయ్య పాల్గొన్నారు.