దండేపల్లి : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన సన్న రకం ధాన్యానికి రూ. 500 బోనస్ హామీ నెలలు గడుస్తున్నా ఇవ్వకపోవడంపై బీఆర్ఎస్ (BRS) నాయకులు మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు(Former MLA Diwakar Rao) ఆధ్వర్యంలో రైతులు శనివారం దండేపల్లి మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై ( Highway) బైఠాయించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు మాట్లాడుతూ మంచిర్యాల నియోజకవర్గ రైతులకు బోనస్ కింద ఇంకా 98శాతం చెల్లించాలన్నారు. గ్రామానికి ఒక్క రైతుకు కూడా బోనస్ (Bonus) అందలేదన్నారు. బోనస్ పేరిట బోగస్ మాటలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.
మోసకారి కాంగ్రెస్ను తరిమికొట్టాలన్నారు. లక్షెట్టిపేట, దండేపల్లి ఎస్సైలు సతీష్, తహసీనుద్దీన్ అక్కడికి చేరుకుని ఆందోళనను విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల నియోజకవర్గ యువ నాయకులు నడిపెల్లి విజిత్ రావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు చుంచు శ్రీనివాస్, సొసైటీ చైర్మన్, వైస్ చైర్మన్ కాసనగోట్టు లింగన్న, అక్కల రవి, మాజీ వైస్ ఎంపీపీ పసర్తి అనిల్, బీఆర్ఎస్ నాయకులు పోడేటి శ్రీనివాస్ గౌడ్, పాదం శ్రీనివాస్, రైతులు పాల్గొన్నారు.