నార్నూర్ : విద్యుత్ షాక్తో ( Electric shock ) ఆదిలాబాద్ జిల్లా నార్నూరు మండలం మాహదాపూర్ గ్రామంలో యువకుడు మృతి చెందాడు. కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. హన్మంత్ రావ్ కాంబ్లే ( Hanmant Rao Kamble ) అనే యువకుడు గురువారం ఉదయం బట్టలకు ఐరన్ చేస్తున్న సమయంలో విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు.
హన్మంత్ రావ్ బీఆర్ఎస్లో అంకితభావంతో పనిచేస్తూ పార్టీ బలోపేతానికి తన వంతు సేవలు అందించేవాడని వివరించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు ఘటనస్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నామని నార్నూర్ పోలీసులు తెలిపారు.