బోథ్, అక్టోబర్ 30: సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే అభివృద్ధి సాధ్యమవుతుందని బోథ్ ఎంపీపీ తుల శ్రీనివాస్ అన్నారు. మండలంలోని రాంనగర్, సాంగ్వి గ్రామాల్లో సోమవారం ప్ర చారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎంపీపీ మాట్లాడుతూ. కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిందన్నా రు. 24 గంటల కరెంట్, రైతుబంధు, రైతుబీమా, పింఛన్లు, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్‌కిట్ వంటి పథకాలతో పాటు ప్రస్తుతం పింఛన్లు, రైతుబంధు పెంపు, గృహలక్ష్మి, బీసీబంధు, బీమా వంటి పథకాలు అమలు చేస్తామని మ్యానిఫెస్టోలో ప్రకటించిందన్నారు. బోథ్ అభ్యర్థి జాదవ్ అనిల్‌ను కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సొసైటీ చైర్మన్ కే ప్రశాంత్, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు బీ శ్రీధర్‌రెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు.
బోథ్ మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో మండల కన్వీనర్ డీ నారాయణరెడ్డి, మల్లెపూల సుభాష్, రమణాగౌడ్, జీ నారాయణ, బీమ బుచ్చన్న, బీరం రవీందర్‌యాదవ్, సత్యనారాయణ సోలంకి, ఎస్వీ రమణ, రఫీ, దీటి దేవిదాస్, భీంరావ్, రఫీ, గంగాధర్, వాహిద్ పాల్గొన్నారు.
భీంపూర్,అక్టోబర్ 30: రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌తోనే రైతు రాజ్యం ఉంటుందని భీంపూర్ జడ్పీటీసీ కుమ్ర సుధాకర్ అ న్నారు. బీఆర్ఎస్ జిల్లా ప్రతినిధి గడ్డం లస్మన్న, మండల కన్వీనర్ మేకల నాగయ్యతో కలిసి కామట్‌వాడ, గోవింద్పూర్ , జెండాగూడ తదితర గ్రామాల్లో సోమవారం ఇంటింటా ప్రచా రం చేశారు. పంటచేలకు వెళ్లి రైతులు,కూలీలకు ప్రభుత్వ పథకాలను వివరించారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ మాట్లాడుతూ రైతుబంధు, రైతు బీమా , ఉచిత విద్యుత్, సాగునీటి వసతితో ఇపుడు ప్రతి గ్రామంలో పల్లెప్రగతి, ప్రతి చేనులో పచ్చదనం కనిపిస్తున్నదని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాటలు నమ్మొద్దన్నారు. కొత్త మండలంగా భీంపూర్ ఎంతో అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు. సర్పంచులు నిమ్మ వేణుయాదవ్, తాటిపెల్లి లావణ్య , మడావి లింబాజీ, కృష్ణ, బాదర్, నాయకులు మార్సెట్టి అనిల్, షేక్ అఫ్రోజ్, జీ నరేందర్, సంజీవ్‌రెడ్డి, గౌడి నారాయణ, ఎం.కల్చాప్ యాదవ్, గంగన్న, ముకుంద సంతోష్, జహూర్అహ్మద్, నితిన్, తదితరులున్నారు.
బజార్హత్నూర్,అక్టోబర్ 30: బజార్హత్నూర్లో బీఆర్ఎస్ పార్టీ ప్రచారం జోరుగా దూసుకెళ్తున్నది. అందరికంటే ముందుగానే జనంలోకి వెళ్లిన గులాబీ దళం ప్రజలతో మమేకమవుతూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. మండలంలోని గు లాబ్ తండా, ఎస్సాపూర్ తదితర గ్రామాల్లో సోమవారం ఇం టింటికీ వెళ్లి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మాజీ మండల కన్వీనర్ నానం రమణ మాట్లాడుతూ .. పేదల సంక్షేమమే లక్ష్యంగా బీఆర్ఎస్ మ్యానిఫెస్టో ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో బోథ్ నియోజక వర్గ బీఆర్ఎస్ ఆభ్యర్థి అనిల్‌జాదవ్‌ను కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. నాయకులు అల్కెగణేశ్, కొత్త శంకర్, చిల్కూరి భూమయ్య, సూది నందు, చట్ల గజ్జాయ్య, బొడ్డు, శ్రీనివాస్, మడిగే రమణ, పడిపెల గంగయ్య, కర్వల మధుకర్, జ్ఞానేశ్వర్ పాల్గొన్నారు.
తాంసి, అక్టోబర్ 30: రాష్ట్రంలో ఇంటింటికీ సంక్షేమ ఫలాలు అందించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని జడ్పీటీసీ తాటిపల్లి రాజు అన్నారు. మండలంలోని బండల్ నాగపూర్ గ్రామంలో సోమవారం ఎంపీపీ సురకుంటి మంజులాశ్రీధర్ రెడ్డితో కలిసి ఇంటింటికీ బీఆర్ఎస్ ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంట్లో కుటుంబ స భ్యులందరూ ఏదో ఒక పథకం పొందుతున్నారని తెలిపారు. అనిల్ జాదవ్‌ను ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించాలని, కప్పర్ల గ్రామంలో మంగళవారం నిర్వహించే బీఆర్ఎస్ ఇంటిం టా ప్రచార కార్యక్రమం విజయవంతం చేయాలని నాయకు లు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ముచ్చ రేఖారఘు, సర్పంచ్‌లు గంగుల వెంకన్న, అలాలి జ్యో తి నర్సింగ్, సదానందం, అండె అశోక్, మండల కన్వీనర్ అరు ణ్, బీఆర్ఎస్ నాయకులు లింగారెడ్డి, రజినీకాంత్ రెడ్డి, వెంకట రమణ, రాంచందర్ రెడ్డి, శంకర్, సిరిగిరి దేవేందర్, సునీల్, సురేశ్, రమేశ్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వైస్ చైర్మన్ ధనుంజయ్, నారాయణ, ఎస్సీ సెల్ మండలాధ్యక్షుడు దయానంద్ పాల్గొన్నారు.
ఇచ్చోడ, అక్టోబర్ 30: మండలంలోని డాబా(కే),(బీ) గ్రా మాల్లో సోమవారం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులు, బీఆర్ఎస్ మ్యానిఫెస్టో పై సోమవారం ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటేసి అనిల్ జాదవ్‌ను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ నిమ్మల ప్రీతం రెడ్డి, ఉప సర్పంచ్ లోక శిరీష్ రెడ్డి, మండల కన్వీనర్ కృష్ణారెడ్డి, మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు ముండే పాండు, ఎంపీటీసీ గాడ్గె సుభాష్, మాజీ కన్వీనర్ మేరాజ్ అహ్మద్, మాజీ జడ్పీటీసీ కృష్ణకుమార్, సర్పంచ్ బత్తుల గంగారాం, ఉప సర్పంచ్ రుద్రాక్ష, రూమ రమేశ్, బీఆర్ఎస్ నాయకులు జమిడి సర్పంచ్ సుభాష్ పటేల్, నరాల శ్రీనివాస్, నర్వడే రమేశ్, సాబీర్, మతిన్, ఎంపీటీసీ వెంకటేశ్, దయాకర్, పీఏసీఎస్ మాజీ డైరెక్టర్ గంగాధర్, గోపు ల వినోద్, గజ్జరాం, సోమన్న, రమణయ్య, షేక్ ముస్తఫా, స ర్పంచ్ ఫరీద్, మాజీ ఎంపీటీసీ దయాకర్ రెడ్డి, బద్ధం పురుషో త్తం రెడ్డి, అరుగుల గణేశ్, కలీం, భీంరావ్, రాజేశ్వర్ ఉన్నారు.
నేరడిగొండ, అక్టోబర్ 30 : బీఆర్ఎస్ పార్టీ బోథ్ నియోజక వర్గ ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్‌ను ప్రజలు ఆదరించి రానున్న ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని ఆ పార్టీ మండల కన్వీనర్ అల్లూరి శివారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ మందుల రమేశ్, మాజీ చైర్మన్ సాబ్లె నానక్‌సింగ్ కోరారు. మండలంలో ని కుప్టి, కుమారి, తర్నం గ్రామాల్లో సోమవారం ఇంటింటా ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ కాంగ్రెస్ నాయకుల మాయమాటలను నమ్మొద్దని అన్నారు. నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే సాధ్యమని పేర్కొన్నారు. జాదవ్ అనిల్‌ను బోథ్ ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే మరింత అభివృద్ధి చేసుకోవచ్చని సూచించారు. ఎన్నికల మ్యానిఫెస్టో మినీ పోస్టర్ల ను అందించి ఓట్లను అభ్యర్థించారు. సర్పంచ్ రాజుయాదవ్, సీనియర్ నాయకులు గడ్డం భీంరెడ్డి, నాయకులు హనుమ య్య, అరుణ్, తులసీదాస్, లస్మన్న, కమలాకర్ ఉన్నారు.
సొనాల, అక్టోబర్ 30: సొనాల మండలంలోని కోట, ఘన్ పూర్ గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు ప్రచారం చేశారు. సీఎం కేసీఆర్ ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలే తమ బలమని ఎంపీపీ తుల శ్రీనివాస్ తెలిపారు. పథకాలపై ప్రజలకు అ వగాహన కల్పించారు. బోథ్ ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్ జాదవ్‌ను గెలిపించాలని ఆయన కోరారు. సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కదం ప్రశాంత్, కోట సర్పంచ్ పూజ-సంగ్రామ్, ఎంపీటీసీ జమునారాజేశ్వర్, ఘన్ పూర్ సర్పంచ్ శకుంతలాగులాబ్ సింగ్, రోహిదాస్, హరీశ్, సుగుణాకర్, సుధీర్ రెడ్డి, నరేందర్, ముఖేశ్, గజానంద్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.