తాంసి(భీంపూర్), అక్టోబర్ 30 : రాష్ట్ర ప్రభుత్వం దండారీ ఉత్సవాల్లో భాగంగా రూ.15 వేలు అందిస్తున్నదని, అలాగే రైతులందరికీ రుణమాఫీ, రైతు భరోసా ఇస్తే బాగుంటుండే అని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. బుధవారం భీంపూర్ మండల కేంద్రంలో ఎంపీ నగేశ్‌తో కలిసి ఎస్టీ కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించి, కుమ్రం భీం విగ్రహావిష్కరణ చేశారు. ముందుగా ఎంపీ, ఎమ్మెల్యేలకు ఆదివాసులు గుస్సాడీ, దండోరా నృత్యాలతో స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో భీంపూర్ మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఆదివాసులకు ఆత్మగౌరవం, అస్తిత్వాన్ని కల్పించిన పోరాట యోధుడు కుమ్రం భీం అని ఎంపీ నగేశ్ పేర్కొన్నారు. ఒకే వేదికపై అన్ని పార్టీల నాయకులు కనిపించారని ప్రజలు చర్చించుకున్నారు. ప్రగతిలో కూడా కలిసి నడవాలని కోరుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, డీసీసీబీ చైర్మన్ భోజారెడ్డి, మాజీ ఎంపీ సోయం బాపురావ్, మాజీ జడ్పీటీసీ కుమ్ర సుధాకర్, మాజీ ఎంపీపీ గడ్డం లస్మన్న, మాజీ సర్పంచ్ లింబాజీ, తుడుందెబ్బ తలమడుగు మండలాధ్యక్షుడు కుమ్ర జ్ఞానేశ్వర్, నాయకులు తిరుమల్ గౌడ్, రాకేశ్, మేకల నాగయ్య, గంధం రమణ, కృష్ణ, కుమ్రం భీం కమిటీ సభ్యులు మడావి లింబాజీ, పురుషోత్తం, రవీందర్ జాదవ్, బలిరాం, ఉత్తం రాథోడ్, ధరం సింగ్, పాండురంగ్, జి.నరేందర్, నితీన్, అఫ్రోజ్, సంతోష్, కల్చప్ యాదవ్, గోవర్ధన్, జపూర్ అహ్మద్, జజ్జరి రాకేశ్ రెడ్డి, రమేశ్, నారాయణ రావ్, దేశ్‌ముఖ్, అశోక్, రఘు పాల్గొన్నారు.