ఆదిలాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): కుల, మతాల మధ్య చిచ్చు పెట్టి బీజేపీ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నదని, ఆ పార్టీ ఆలయాల అభివృద్ధికి చేసిందేమీ లేదని ఆదిలాబాద్ ఎమ్మె ల్యే జోగు రామన్న మండిపడ్డారు. జిల్లాకేంద్రంలోని కైలాస్నగర్ పోచమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో రూ.5 లక్షలతో నిర్మించనున్న షెడ్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ముం దుగా కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యేకు డప్పు చప్పుళ్ల నడుమ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూ జలు చేశారు. నేతలతో కలిసి షెడ్ నిర్మాణ పనుల కు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ.. మంత్రి కేసీఆర్ సారథ్యంలో నియోజకవర్గంలోని ఆలయాల అభివృద్ధికి దాదా పు రూ.10 కోట్లు వెచ్చించినట్లు తెలిపారు.
దేవుడి పేరుతో రాజకీయాలు చేసే బీజేపీ ఇప్పటి వరకు కేంద్రం తరఫున ఆలయాల అభివృద్ధి కోసం ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీని హిందువులకు వ్యతిరేకంగా చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ.. రాష్ట్రంలో ఎన్ని ఆలయా లు కట్టారో చూపించాలని పేర్కొన్నారు. అయోధ్యలో నిర్మిస్తున్న రామాలయానికి సైతం ప్రజల నుంచి చందాలు వసూలు చేశారని గుర్తు చేసిన ఆయన.. తాను సైతం రూ.లక్ష విరాళాన్ని అందజేసినట్లు తెలిపారు. కుల, మతాల పేరిట చిచ్చు పెడుతూ రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నాలు చేయడం తప్పితే ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల వారికి అండగా నిలుస్తూ అందరి అభ్యున్నతే లక్ష్యంగా ముందుకు సాగుతున్నదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు అలాల్ అజయ్, నాయకులు రాం కుమార్, అశోక్, గంగారెడ్డి, దుర్గం శేఖర్, అతిక్ పాల్గొన్నారు.