ఆదిలాబాద్ : విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేలా ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. బడి బాట కార్యక్రమంలో భాగంగా భుదవారం ఆయన మావల మండలం బట్టి సవర్ గాం ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద విద్యార్థులు బాగా చదువుకునేందుకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని తెలిపారు. ఈ సంవత్సరం నుంచి ఇంగ్లీష్ మీడియంలో బోధన ఉంటుందన్నారు. బోధనతో పాటు ఉపాధ్యాయులను కూడా ప్రభుత్వం నియమిస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నిష్ణాతులైన ఉపాధ్యాయులతో బోధన ఉంటుందన్నారు.