సీసీసీ సస్పూర్/రామకృష్ణాపూర్/బెల్లంపల్లి, ఫిబ్రవరి 6 : మంచిర్యాల పట్టణం శివమూగింది.. క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ జన ప్రభంజనమై కదం తొక్కింది.. బెల్లంపల్లి బ్రహ్మరథం పట్టింది.. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయడానికి వచ్చిన మాజీ మంత్రి హరీశ్‌రావుకు మంచిర్యాల జిల్లా ప్రజలు, సింగరేణి ప్రాంతవాసులు అడుగడుగున బ్రహ్మరథం పట్టారు. సింగరేణిని నట్టేట ముంచేందుకు రేవంత్‌రెడ్డి సర్కార్ చేస్తున్న కుట్రలపై హరీశ్‌రావు ధ్వజమెత్తారు. సర్కార్ విధానాలను ఎండగట్టారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని షిర్కె చౌరస్తా, క్యాతన్‌పల్లిలోని రాజీవ్‌చౌక్, బెల్లంపల్లిలో కాంటాచౌరస్తాలో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లలో మాజీ మంత్రి మాట్లాడారు. సింగరేణిని కాంగ్రెస్ సర్కార్ నట్టేట ముంచే కుట్రలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్ సర్కార్ హయాంలో సింగరేణి కార్మిక కుటుంబాలకు కారుణ్య నియామకాలు చేపట్టి ఉద్యోగాలు కల్పిస్తే.. అధికారంలో వచ్చిన తర్వాత కాంగ్రెస్ సర్కార్ మెడికల్ బోర్డులు పెట్టకుండా అనారోగ్యంతో బాధపడుతున్న కార్మికులను వేధింపులకు గురి చేస్తున్నదని మండిపడ్డారు. బామ్మర్ది సృజన్‌రెడ్డి కళ్లలో ఆనందం చూడడానికి, కోట్లాది రూపాయల సింగరేణి సొమ్మును అక్రమంగా కట్టబెట్టడానికి సింగరేణి టెండర్లలో మార్పులు చేశారన్నారు. మునుపెన్నడు లేదని విధంగా సైట్ విజిట్ సర్టిఫికేట్ నిబంధన తీసుకొచ్చి అనుయాయులకు టెండర్లు కట్టబెడుతున్నారని మండిపడ్డారు. ఇటీవలే సింగరేణిలో జరిగిన భారీ కుంభకోణాలను బయటపేడితే అక్రమ కేసులతో వేధింపులకు గురి చేస్తున్నారు. అయినా భయపడేది లేదని.. కాంగ్రెస్ అక్రమాలు, హామీలపై నిలదీస్తునే ఉంటామన్నారు. తెలంగాణకు మణిహారమైన సింగరేణిని కాపాడుకుంటామని స్పష్టం చేశారు.

ఎన్నో త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణను రేవంత్‌రెడ్డి సర్కార్ సర్వనాశనం చేస్తున్నదని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. పెన్షన్లను పెంచలేదని, రైతుబంధు ఊసే ఎత్తడం లేదన్నారు. మహిళలకు రూ.2500, స్కూటీలు అందించలేదని, కల్యాణలక్ష్మి తులం బంగారం ఇవ్వకుండా అన్యాయం చేశారని అన్నారు. ఒక వేల కాంగ్రెస్‌కు ఓటు వేసి గెలిపిస్తే ప్రజల మద్దతు తమకే ఉందని, వారు ఇచ్చిన హామీలు ఇక ఎప్పటికి అమలు చేయరని అన్నారు. ప్రజలంతా జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. కేసీఆర్ తీసుకువచ్చిన పథకాలను రద్దు చేస్తున్నారని అన్నారు. వారి వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి అక్రమ కేసులతో వేధింపులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దేశానికే దిక్సూచిగా నిలిచే పథకాలను అమలు చేసినట్లు ఆయన వివరించారు. తాము 1. 67లక్షల ఉద్యోగాలు ఇస్తే రేవంత్‌రెడ్డి ఇప్పటి వరకు 10 వేల ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేశారని ఆరోపించారు. తెచ్చుకున్న తెలంగాణలో సంపదను పెంచుకుంటు ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి ద్వారా అందించామని ఆయన వివరించారు. మంచిర్యాలను జిల్లా చేశామని, మెడికల్ కళాశాలను తీసుకొచ్చామని గుర్తు చేశారు. ప్రస్తుతం జిల్లాలను ఎత్తివేసే కుట్రలు చేస్తున్నారని, దీంతో మంచిర్యాల జిల్లా కూడా రద్దు అయ్యే ప్రమాదం ఉందన్నారు. అక్రమంగా సంపాదించిన డబ్బులను ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి పంపిస్తున్నారని.. వారిచ్చే డబ్బులు తీసుకొని కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు.
మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు చేసిన అభివృద్ధి ఏమీలేదని, అక్రమాలు, దౌర్జన్యాలు, కేసులతో వేధింపులకు గురిచేయడం మానుకోవాలన్నారు. వారికి వంత పాడే పోలీసులను వదిలిపెట్టే ప్రసక్తేలేదన్నారు. మంచిర్యాల కార్పొరేషన్ ప్రజలు బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించి.. సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావులకు బుద్దిచెప్పాలని కోరారు. చెన్నూర్‌లో మంత్రి వివేక్.. గడిచిన రెండేళ్లలో తట్టడు మట్టి కూడా తీయలేదన్నారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ అసలు జనాలకే దొరకడం లేదన్నారు. ఎన్నికలప్పుడు వంద రోజుల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని బాండ్ రాసిచ్చిన ఎమ్మెల్యేను.. ఇచ్చిన హామీలపై నిలదీయాలని పిలుపునిచ్చారు.
మంచిర్యాల జిల్లా ఎన్ని ఏండ్ల కళ. ఆ కళను నిజం చేసింది కేసీఆర్ అన్నా రు. మంచిర్యాల, ఆసిఫాబాద్‌లను జిల్లాలు చేసింది. అలా చేయబట్టే ఆదిలాబాద్ దాకా పోయే బాధలు తప్పినయ్.. అలాంటి జిల్లాలను రద్దు చేస్తా అంటూ ఊరుకుంటారా.. ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. ప్రజలు ఒక అవకాశం ఇచ్చి చూద్దామని కాంగ్రెస్‌ను గెలిపించారన్నారు. కానీ వాళ్లు ఆ అవకాశం దుర్వినియోగం చేస్తున్నారని, ప్రజల కోసం కాకుండా.. వాళ్ల ఆస్తులు పెంచుకోడానికి వాడుకుంటున్నారు. దయచేసి 11వ తేదీన ఎన్నికల్లో మీరంతా కారు గుర్తుకు, క్యాతన్‌పల్లిలో కారు, కంకికొడవలి గుర్తులకు ఓటేయాలని పిలుపునిచ్చారు. రేవంత్ రెండేళ్ల పాలనలో ఏ ఒక్క వర్గం బాగుపడలేదన్నారు. ఆటో డ్రైవర్లు ఏడుస్తున్నడు.. నిరుద్యోగ యువకులు బాధపడుతున్నరు.
అక్కాచెల్లెళ్లు బంగారం ధర పెరిగిందని బాధపడుతున్నరు. సింగరేణి కార్మికులు మా సింగరేణి ఆగమైందని బాధపడుతున్నరు. మందు బస్తాలు దొరక్క మా రైతులు బాధపడుతున్నరు. బాధపడంది ఎవరూ లేదన్నారు. కేసీఆర్ అందరిని కన్న బిడ్డల్లా… ఓ కుటుంబంలా.. ఆలోచించార ని, కానీ కాంగ్రెస్‌కు ఆ సోయి లేదన్నారు. ఏమన్న అంటే పోలీసోళ్లను అడ్డం పెట్టుకొని.. కేసలు పెట్టి బూతులు మాట్లాడి.. బెదిరించి బతుకుదాం అనుకుంటున్నారన్నారు. భయపెడితే భయపడుతారా.. ఇది సీకాసా గడ్డ.. బయపడే గడ్డనా ఇది .. మాములు గడ్డనా . పోరాటాల గడ్డ.. ఎవడన్న భయపట్టిస్తే వాళ్లకే చుక్కలు చూపించిన గడ్డ ఇది.
ఈ కాంగ్రెసోళ్లకో.. ఈ తాటాకు చప్పుళ్లకు బయపడే గడ్డ కాదన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి గుణపాఠం.. కాంగ్రెసోళ్లను చీరి చింతకుకట్టాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపిస్తే గెలిచిన వెంటనే మంచిర్యాల జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల అభివృద్ధిని నిధులు ఇచ్చే బాధ్యత మాది అని హామీ ఇచ్చా రు. సింగరేణి ప్రాంత సమస్యలపై హరీశ్‌రావు ప్రసంగం ఆధ్యంతం ఆహుతులను ఆకట్టుకున్నది. మాట్లాడినంత సేపు అందరు శ్రద్ధగా వింటూ చప్ప ట్లు, కేరింతలు కొట్టారు.
ముఖ్యంగా సింగరేణి సంస్థలో నెలకొన్న పరిస్థితు లు, సంస్థలో జరిగిన కుంభకోణాలు, కేసీఆర్ హయాంలో సింగరేణిలో జరిగిన అభివృద్ధిని ప్రస్తావించడం కార్మిక కుటుంబాలను ఆలోచింపజేసింది. ఈ కార్యక్రమాల్లో బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు, రాష్ట్ర నాయకులు విజిత్‌రావు, బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఏఐటీయూ సీ రాష్ట్ర అధ్యక్షుడు సీతారామయ్య, సీపీఐ కార్యవర్గ సభ్యులు కలవేని శంక ర్, టీబీజీకేఎస్ రాష్ట్ర నాయకులు రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

ఎదులాపురం, ఫిబ్రవరి 6 : కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధి, ఉద్యోగాల నోటిఫికేషన్ సర్టిఫికెట్స్‌ను సీఎం రేవంత్ అందించి తాము చేసినట్టు గొప్పలు చెప్పుకుంటున్నారని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆదిలాబాద్ పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించారు. వార్డు నంబర్ 33, 34లో అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించి కారు గుర్తుకు ఓటేయ్యాలని కోరారు. ఇందులో అభ్యర్థులు జోగు ప్రేమేందర్, అశోక్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అజయ్, నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ జోగు ప్రేమేందార్, పట్టణాధ్యక్షుడు అజయ్, సలీం పాషా, శ్రీలత, అశోక్, కడదారుపు సంతోష్, బొజ్జ సంతోష్, ఇబ్బు గణేశ్ పాల్గొన్నారు.
నిర్మల్ అర్బన్, ఫిబ్రవరి 6 : కాంగ్రెస్, బీజేపీలతో అభివృద్ధి శూన్యం అని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్మల్ పట్టణంలోని 9, 30వ వార్డుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్మల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో చేసింది శూన్యమని చెప్పారు. బీజేపీ పాలనలో నిర్మల్ మున్సిపాల్టీకి ఒక్క రూపాయి రాలేదని తెలిపారు. అనంతరం నిర్మల్ పట్టణంలోని గుల్జార్ మార్కెట్లో ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త రాంకిషన్‌రెడ్డి, అయ్యన్నగారి రాజేందర్, తుల శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఖానాపూర్ టౌన్, ఫిబ్రవరి 6 : ఎన్నికల సమయంలో మోసపూరిత హమీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజవర్గ ఇన్చార్జి భుక్యా జాన్సన్ నాయక్ మండిపడ్డారు. శుక్రవారం మున్సిపాలిటీలోని ఏడో వార్డులో బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి గౌరికర్ రాజు తరఫున ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పానగంటి రాజేందర్, బండారి కిశోర్, మహిపాల్ పాల్గొన్నారు.
భైంసా, ఫిబ్రవరి 6 : నిర్మల్ జిల్లా భైంసా మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ముథోల్ నియోజకవర్గ బీఆర్ఎస్ సమన్వయ సమితి సభ్యులు లోలం శ్యాంసుందర్, డాక్టర్ కిరణ్ కొమ్రేవార్ అన్నారు. శుక్రవారం ఆరో వార్డులో ప్రచారం నిర్వ హించారు. వారి వెంట సుంకెట పోశెట్టి ఉన్నారు.
ఎదులాపురం, ఫిబ్రవరి 6 : ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కొత్త తరహా నిరసనలు పుట్టుకొస్తున్నాయి. సొంత వార్డులో టికెట్ దకక పక వార్డుల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఓటర్లు ఫ్లెక్సీలతో నిరసన తెలుపుతున్నారు. ‘మీ గల్లీలో సత్తా లేక.. మా గల్లీకి వస్తావా?’ అంటూ 49వ వార్డులో ఫ్లెక్సీలు వెలువడం చర్చనీయాంశంగా మారింది.