ముంబై, ఆగస్టు 12 : జియో ఫైనాన్షియల్ సర్వీసెస్లో..బ్యాంక్ ఆఫ్ అమెరికా(బోఫా) 49.9 శాతం వాటాను 1.9 బిలియన్ డాలర్లు లేదా రూ.18,268 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ వాటా కొనుగోలుకు సంబంధించి ఇరు సంస్థల ఉన్నతాధికారులు ఒప్పందంపై సంతకాలు చేశారు.
ఆర్థిక సేవలు అందించాలనే ఉద్దేశంతో ముకేశ్ అంబానీ..జియో ఫైనాన్షియల్ సేవలను రెండేండ్ల క్రితం ప్రారంభించారు.