న్యూఢిల్లీ: చట్ట సభ్యుల విశేషాధికారాల పరిధి, పత్రికా స్వేచ్ఛ, వాక్ స్వాతంత్య్ర హక్కు, భావ ప్రకటనా స్వేచ్ఛ దాని ప్రభావానికి సంబంధించిన కీలక అంశంపై విచారణను ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఆక్టోబర్ ఆరవ తేదీ నుంచి ప్రారంభించనున్నదని సుప్రీంకోర్టు బుధవారం తెలిపింది.
2003లో తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ కే కలిముత్తు జర్నలిస్ట్ ఎన్ రవితో పాటు ఆరుగురు జర్నలిస్టుల అరెస్ట్‌కు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై కోర్టును ఆశ్రయించగా, పరస్పర విరుద్ధమైన తీర్పుల దృష్ట్యా ఈ వ్యవహారాన్ని ఏడుగురు సభ్యుల ధర్మాసనానికి సిఫార్సు చేసింది. ప్రాథమిక హక్కులే ప్రాధాన్యత సంతరించుకోవాలని ఒక తీర్పు పేర్కొనగా, పార్లమెంటరీ విశేషాధికారాల కంటే ప్రాథమిక హక్కులు తక్కువ స్థాయివని 1965 నాటి తీర్పు పేర్కొంది.