ఖానాపూర్ టౌన్, అక్టోబర్ 10 : న్యాయ సమీక్షకు నిలబడదని తెలిసే కాంగ్రెస్ ప్రభుత్వం జీవో9 జారీ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు తీరని ద్రోహం చేసిందని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన జీవో 9పై హైకోర్టు స్టే విధించడంతో శుక్రవారం బీఆర్ఎస్ శ్రేణులు తెలంగాణ చౌక్ వద్ద తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఖానాపూర్ బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గౌరికర్ రాజు హైకోర్టు 3 నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని గడువు విధించడంతో ఎన్నికలు నిర్వహించే ఉద్దేశ్యం లేకనే ప్రభుత్వం కోర్టులో నిలబడదని, పార్లమెంట్లో చట్టం ద్వారానే రిజర్వేషన్లు అమలవుతాయని తెలిసి కూడా జీవోలు జారీ చేసిందని తెలిపారు. ఎన్నికల్లో ఓటమి భయంతోనే కుట్రపన్నిందని ఆరోపించారు. 42 శాతం రిజర్వేషన్లను రాజ్యాంగపరంగా ఇస్తామని, మరోసారి ఆర్డినెన్స్ ద్వారా అని, ఇంకోసారి పార్టీ పరంగా ఇస్తామని మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి బీసీలను కాంగ్రెస్ పార్టీ మభ్యపెడుతుందన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం తప్పదన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో పుప్పాల గజేందర్, కొక్కుల ప్రదీప్, శనిగారపు శ్రావణ్, తోట సుమిత్, రాజేశ్వర్ గౌడ్, పార్శపు శ్రీను, కోడారి గోపాల్, బాపురావు, అమరగోని మల్లేశ్, వాల్సింగ్, వసంత్, బీసీ రాజన్న, కారింగుల సుమన్, సంద రాకేశ్, శ్రీదర్గౌడ్, కుర్ర గంగాధర్, కొక్కుల శేఖర్, బీఆర్ఎస్ నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎదులాపురం, అక్టోబర్ 10 : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను ఎవరు అడ్డుపడుతున్నారో బీసీలకు తెలుసని.. డ్రామాలు అడితే ఎన్నికల్లో తగిన గుణపాఠం తప్పదనిబీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చికాల దత్తు అన్నారు. బీసీ రిజర్వేషన్ ను వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ వేసిన వారి దిష్టిబొమ్మతో ఆదిలాబాద్లో ప్రదర్శన నిర్వహించారు. తెలంగాణ చౌక్ వద్ద దిష్టిబొమ్మ దహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య తోపులాట జరిగింది. అనంతరం రహదారిపై బైఠాయించి పిటిషన్లు, వ్యతిరేస్తున్న వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్ను అమలు చేయాలని డి మాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బీసీ సంఘం ప్రధాన కార్యదర్శి కలల శ్రీనివాస్, అంజేశ్, శ్రీనివాస్, అశోక్, రాము, చందు, శామల ప్రశాంత్ తదితరులున్నారు.
తలమడుగు, అక్టోబర్ 10 : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు అయ్యాకే ఎన్నికలు నిర్వహించాలని, లేదంటే ఎన్నికలను బహిష్కరిస్తామని తలమడుగు మండల బీసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం మండలంలోని సుంకిడి అంతరాష్ట్ర రహదారిపై రాస్తారోకో చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం మండలాధ్యక్షులు మేకల రవికాంత్ యాదవ్, ప్రధాన కార్యదర్శి వెంకన్న, వర్కింగ్ ప్రెసిడెంట్ మడూరి రమాకాంత్, బీసీ సంఘాల నాయకులు తోట వెంకటేశ్, ఆశన్న యాదవ్, అసం రవి, మహేందర్ యాదవ్, రిషికాంత్, శ్రీనివాస్, వామన్, అజయ్, తోట ప్రమోద్, శశికాంత్, తదితరులు పాల్గొన్నారు.
ఉట్నూర్, అక్టోబర్10: కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు కావాలనే అన్యాయం చేస్తుందని బీసీ సంఘాల నాయకులు కందుకూరి రమేశ్, సీపతి లింగగౌడ్, బింగి వెంకటేశ్, బొడ్డు కిరణ్, రాజేశ్వర్, కొండేరి రమేశ్ అన్నారు. శుక్రవారం ఉట్నూర్లో స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42శాతం రిజర్వేషన్ ఇస్తామంటూ అగ్రకులాలకే పెద్ద పీట వేశారన్నారు. మంత్రి పదవుల కేటాయింపులోనూ అన్యాయం జరిగిందన్నారు.