చెన్నూర్, జనవరి 6 : నియోజకవర్గంలోని చెన్నూర్, కోటపల్లి, భీమారం, జైపూర్, మందమర్రి మండలాల్లోని వంద గ్రామా ల్లో గ్రంథాలయాలను నిర్మించాలని ప్రభు త్వ విప్ బాల్క సుమన్ నిర్ణయించారు. ఒ క్కో చోట రూ. 4లక్షలతో ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. గ్రంథాలయ నిర్మాణం ఎలా ఉండాలనే అంశపై ఇప్పటికే విప్ సుమన్ సంబంధిత ఇంజినీరింగ్ అధికారులతో పలుమార్లు సమీక్షించారు. వారితో చర్చించిన తర్వాత గ్రంథాలయ నిర్మాణానికి సంబంధించిన నమూనాను ఇటీవల ఆయన విడుదల చేశారు.
నిరుద్యోగులకు ఎంతో మేలు..
గ్రామాల్లో ఇంజినీరింగ్, ఇతర వృత్తి విద్యా కోర్సులు, డిగ్రీ, పీజీ చదివిన యువతి, యువకులు ఉన్నారు. వీరంతా ఉద్యోగాల కోసం పలు పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతుంటారు. ఆర్థికంగా లేని వారు ఇంటి వద్దే సిద్ధమవుతుంటారు. అయితే వారికి సరైన స్టడీ మెటీరీయల్, చదువుకునేందుకు వసతులు సరిగా లేక పోవడంతో పట్టణ ప్రాంతం వారితో పోటీ పడలేక పోతున్నారు. దానిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ విప్ గ్రంథాలయాలను నిర్మించాలని తలపెట్టారు. ఇందులో పోటీ పరీక్షలకు అవసరమైన అన్ని రకాల పుస్తకాలను అందుబాటులో ఉంచనున్నారు. పాఠకులు రీడింగ్ కోసం పెద్ద హాల్, పుస్తకాల భద్రత కోసం ప్రత్యేక గది ఉండేలా నిర్మించనున్నారు. ప్రశాంత వాతవరణంలో చదువుకునేలా ఏర్పాట్లు చేయనున్నారు. రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు జారీ చేయనుండడంతో ఈ గ్రంథాలయాలు ఎంతగానో ఉపయోగ పడనున్నాయి. అంతేగాకుండా వృద్ధులు, ఇతరులు కూడ వివిధ దిన పత్రికలను చదువుకోవచ్చును. దీంతో వారికి కొంత కాలక్షేపం కూడ కానున్నది.
నిరుద్యోగులకు మేలు..
నేను డిగ్రీ చదివాను. ఉ ద్యోగాల నియమాకాల కోసం జరిగే వివిధ పోటీలకు సిద్ధమవుతున్నా ను. అయితే మాది మారుమూ ల పల్లెటూరు. చదువుకునేందుకు ఎలాంటి సౌకర్యాలు లేవు. ఇప్పుడు ప్రభుత్వ విప్ బాల్క సుమన్ నిర్మించనున్న గ్రంథాలయాల నిర్మాణంతో అన్ని రకాల పుస్తకాలు అందుబాటులోకి రానున్నా యి. సమ యం కూడ వృథా కాదు యువతి, యువకులకు ఎంతో మేలు చేకూరనున్నది.
-సౌమ్య క్షత్రియ, బొప్పారం, కోటపల్లి
ఇక ఇంటి వద్దనే సిద్ధం కావచ్చు
నేను డిగ్రీ వరకు చదివా ను. ఇప్పటికే పలు ఉ ద్యోగ నియమాకాల కో సం జరిగిన పలు పోటీ పరీక్షలకు హాజరయ్యా ను. అప్పుడు సరైనా పుస్తకాలు అందుబాటులో లేక ఎంతో కష్టపడి పోటీ పరీక్షలకు సిద్ధం కావాల్సి వచ్చింది. ఇప్పుడు మా ఊర్లోనే గ్రంథాలయం నిర్మిస్తుండడంతో అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉంటాయి. దీంతో ఇంటి వద్దే ఉండి పోటీ పరీక్షలకు సిద్ధం కావచ్చు.
-దాదా రవి, నాగపూర్, చెన్నూర్
పట్టణ ప్రాంతాల వారితో పోటీ పడుతం..
గ్రామాల్లో అన్ని వసతులతో గ్రంథాలయాలను నిర్మించి, అన్ని రకాల పుస్తకాలను అం దుబాటులో ఉంచనుండడంతో యువతి, యువకుల కు ఎంతో మేలు జరుగుతుంది. వారు వివిధ పోటీ పరీక్షలకు పూర్తి స్థాయిలో సిద్ధం కాగలరు. పట్టణ ప్రాంతాల వారీతో సమానంగా పోటీ పడవచ్చు.
-గడ్డం సత్యరాజ్, ఇందారం, జైపూర్
సంతోషంగా ఉంది..
గ్రామానికి ఒకటి చొప్పున వంద గ్రామాల్లో వంద గ్రంథాలయాలను ప్రభుత్వ విప్ బాల్క సుమన్ నిర్మించ తలపెట్టడం చాలా సంతోషంగా ఉంది. రానున్న రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు జారీ చేయనున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంత నిరుద్యోగులు పోటీ పరీక్షలు సిద్ధం కావడానికి ఈ గ్రంథాలయాలు ఉపయోగపడుతాయి. రానున్న రోజుల్లో భావితరాల వారికి ఎంతో ఉపయోగపడుతాయి.
-తాటి సుష్మ , భీమారం
గ్రామీణ ప్రాంత యువత కోసమే..
గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతి, యువకులు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా వివిధ రకాల పోటీ పరీక్షలకు సిద్ధం కావాలనే లక్ష్యంతో నియోజకవర్గంలోని గ్రామాల్లో గ్రంథాలయాలను నిర్మించనున్నాం. ఒక్కోక్క గ్రంథాలయాన్ని రూ 4లక్షల వ్యయంతో నియోజకవర్గంలోని వంద గ్రామాల్లో మొత్తం రూ. 4 కోట్ల వ్యయంతో కేసీఆర్ పేరుతో నిర్మిస్తాం. ఇప్పటికే నిర్మాణానికి సంబంధించిన నమూనాను కూడ సిద్ధం చేశాం.
-బాల్క సుమన్ ( చెన్నూర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్)