తిర్యాణి, సెప్టెంబర్ 12 : ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆరోపించారు. గురువారం మండలకేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో 62 మందికి కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుపేద యువతుల పెళ్లిళ్లను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణ లక్ష్మి పథకాన్ని తీసుకొచ్చారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కల్యాణ లక్ష్మి చెక్కులతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పి మాట తప్పిందని మండిపడ్డారు. రుణమాఫీపై ఆంక్షలు పెట్టి రైతులను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తిర్యాణి నుంచి త్రీ ఇైంక్లెన్ వరకు బీటీ రోడ్డు మరమ్మతులకు రూ.10 లక్షలు మంజూరు చేయించినట్లు తెలిపారు. అవసరమైతే మరో రూ. 10 లక్షలు వెచ్చించనున్నట్లు చెప్పారు. మంగీ, గుండాల, గోపెర, కౌఠగాం గ్రామాల్లో రోడ్ల అనుమతులు, నిధుల మంజూరుకు నివేదిక లు పంపించామన్నారు. మండల కేంద్రం లో స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా రూ.3 లక్షలతో మరుగుదొడ్లు నిర్మించనున్నట్లు చెప్పారు. సీజనల్ వ్యాధులను దృష్టిలో పెట్టుకొని 30 పడకల దవాఖానలో మరో వైద్యుడిని నియమించేలా కృషి చేస్తామన్నారు.
ఎంపీడీవో వేముల మల్లేశ్, ఇన్చార్జి తహసీల్దార్ వంశీకృష్ణ, పీఏసీఎస్ చైర్మన్ చుంచు శ్రీనివాస్, వైస్ చైర్మన్ చుంచు శ్రీనివాస్, మాజీ ఎంపీపీ శ్రీదేవి, వైస్ ఎంపీపీ కోవ పార్వతి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు హన్మండ్ల జగదీశ్, మాజీ జడ్పీటీసీ చంద్రశేఖర్, బీఆర్ఎస్ నాయకులు ముత్యం రాజయ్య, మల్లేశ్, రమేశ్‌గౌడ్, కుర్సెంగ బాదిరావు, మహిళా నాయకులు ముక్కెర సరిత, వెడ్మ కమల, సుజాత పాల్గొన్నారు.
రెబ్బెన, సెప్టెంబర్ 12 : కల్యాణ లక్ష్మి పథకం ద్వారా నగదుతో పాటు తులం బంగారం అం దించాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. గురువారం రెబ్బెన మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో 77 మందికి కల్యాణలక్ష్మి చెక్కులు అందించారు. ఇక్కడ తహసీల్దార్ రామ్మోహన్రావు, ఎంపీడీవో శంకరమ్మ, పీఏసీఎస్ చైర్మన్ కార్నాథం సంజీవ్‌కుమార్, ఆర్ఐ ప్రేంకిరణ్ ఉన్నారు.