ఆసిఫాబాద్ అంబేదర్ చౌక్, ఆగస్టు 14: కలెక్టరేట్లో పంద్రాగస్టు వేడుకలను ఘనంగా నిర్వహించాలని కుమ్రంభీం ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ధోత్రే పిలుపునిచ్చారు. గురువారం కలెక్టరేట్లో వేడుకల ఏర్పాట్లను ఎస్పీ కాంతిలాల్ పాటిల్, అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అధికారులు సమన్వయంతో పని చేసి జిల్లా లో స్వాతంత్ర వేడుకలను విజయవంతం చేయాలని తెలిపారు.
వేడుకకు హాజరై ప్రముఖులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. విద్యార్థులతో సాంసృతిక ప్రదర్శనలు చేయించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి దత్తారావు, కలెక్టరేట్ పరిపాలనాధికారి కిరణ్ పాల్గొన్నారు.