
ఆసీఫాబాద్ : జిల్లాలో పత్తి కొనుగోళ్లకు పూర్తి ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ రాల్ రాజ్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో పత్తి కొనుగోళ్ల పై ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారులు , జిన్నింగ్ మిల్లుల యజమానులు పత్తి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు అన్ని వసతులు కల్పించాలని సూచించారు. పత్తి విక్రయానికి వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు.
ప్రభుత్వం పత్తి క్వింటాలు ధర 6వేల 25 రూపాయల మద్దతు ధర ప్రకటించిందని వివరించారు. రైతులు దళారులను నమ్మి మోసపోకుండా నేరుగా ప్రభుత్వం ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించేలా చూడాలన్నారు.