వాంకిడి, ఆగస్టు 2 : అర్హులందరూ కొత్త రేషన్ కార్డుల కోసం మీ సేవలో దరఖాస్తులు చేసుకోవాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్య కోవలక్ష్మి, ఆసిఫాబాద్ అదనపు కలెక్టర్ డేవిడ్ అన్నారు. శనివారం వాంకిడి మండల కేంద్రంలోని రైతు వేదికలో పలువురి లబ్ధిదారులకి కొత్త రేషన్ కార్డుల పత్రాలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో లోకేశ్వర్‌రావు, తహసీల్దార్ కవిత, డీటీ రాంమ్లాల్, ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్, ఆర్ఐలు, సింగిల్ విండో చైర్మన్ జాబో రే పెంటు, సీనియర్ అసిస్టెంట్ పాల్గొన్నారు.
రెబ్బెన, ఆగస్టు 2 : రెబ్బెన మండల కేంద్రంలోని రైతు వేదికలో శనివారం లబ్ధిదారులకు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, జిల్లా అదనపు కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్‌రావు రేషన్‌కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సూర్యప్రకాశ్, ఎంపీడీవో శంకరమ్మ, పీఏసీఎస్ చైర్మన్ కార్నాథం సంజీవ్‌కుమార్, ఆర్టీఏ మెంబర్ లావుడ్య రమేశ్ ఉన్నారు.