జైనూర్ ఆగస్టు16 : అన్నభావుసాఠే ఆశయ సాధనకు కృషి చేయాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. శుక్రవారం మండల కేం ద్రంలో భారత సాహిత్య రత్న డాక్టర్ అన్న భావుసాఠే 14వ జయంతిని ఘనంగా నిర్వహిం చారు. ఆయన చిత్రపటానికి నివాళులర్పించా రు. వంజారి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ ముండే, మాంగ్ సమాజ్ జిల్లా గౌరవ అధ్యక్షుడు మొహళే దత్తా, అధ్యక్షుడు పుల్లారే విజయ్, మహారాష్ట్ర ప్రముఖ సమాజ ప్రభోదకుడు వికాస్ రాజ్ కుడ్మెత, చంద్రపూర్ ప్రముఖ ప్రభోదకుడు రాహుల్ గాయ్క్వాడ్, అంబేద్కర్ అసోసియేషన్ నాయకులు అన్నారావ్ కాంబ్లె, బాబాసాహేబ్ కాంబ్లె, అశోక్ కాంబ్లె, పండరి భండారే, బాబు గౌక్వాడ్, సోన్కాంబ్లె, మొహళే భారత్, శివానంద్, పోచిరాం, పుల్లారే సొపాన్ మహారాజ్, మాజీ ఎంపీపీ కుమ్ర తిరుమల విశ్వనాథ్, మాజీ వైస్ ఎంపీపీ లక్ష్మణ్, బీఆర్ఎస్ నాయకులు మెస్రం అంబాజీరావ్, కనక రాంజీ, ఆత్రం భీంరావ్, అన్నభావుసాఠే జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు ఉన్నారు.
మందమర్రి రూరల్, ఆగస్టు 16 : మండలంలోని ఆదిల్పేటలో నీలం బ్రదర్స్ రైస్ మిల్లును శుక్రవారం అధికారులు సీజ్ చేశారు. ఎన్ఫోర్స్మెంట్ డీటీ పోశయ్య, అంజయ్య తెలిపిన వివరాల ప్రకారం.. నీలం బ్రదర్స్ రైస్ మిల్లుకు శుక్రవారం తెల్లవారు జామున 25 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం వస్తున్నాయని టాస్క్ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. ఆ మేరకు మిల్లు వద్ద కాపుకాశారు. సుమారు రూ. 94,845 విలువగల 25 క్వింటాళ్ల బియ్యాన్ని మిల్లు నిర్వాహకులు కొనుగోలు చేస్తుండగా పట్టుకున్నారు. ఆపై మిల్లును సీజ్ చేశారు. తదుపరి విచారణ కోసం ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామని అధికారులు తెలిపారు. రామకృష్ణాపూర్ ఎస్ఐ రాజశేఖర్, ఏఎస్ఐ వెంకన్న ఉన్నారు.