ఎదులాపురం, మే 16 : ఆదిలాబాద్ జిల్లాకు సరిపడా విత్తనాలను అందుబాటులో ఉంచాలని, వానకాలం సాగుకు సన్నద్ధం కావాలని, ఇందుకోసం ఈ నెల18వ తేదీలోగా యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా వ్యవసాయశాఖ ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన విత్తన, ఎరువుల డీలర్లతో నిర్వహించిన అవగాహన సదస్సులో కలెక్టర్ మాట్లాడారు.
డీలర్ల షాపు లైసెన్స్‌లు తప్పనిసరిగా ఉండాలని, విత్తనాలు, ఎరువులు షా పులో ఉన్న స్టాక్‌ను రోజువారీగా నమోదు చే సి, బిల్‌బుక్ రిజస్టర్ ఏర్పాటు చేసుకోవాలన్నా రు. ఎమ్మార్పీ కంటే అధిక ధరకు అమ్మరాద ని, గడువు ముగిసిన విత్తనాలు, ఎరువులు అ మ్మరాదని రైతులకు అధికారులు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. విత్తనాలు, ఎరువుల కొరత ఉండకూడదన్నారు. నకిలీ పత్తి విత్తనాలు సరఫరా చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ట్రెయినీ కలెక్టర్ అభిజ్ఞన్, వ్యవసాయశాఖ అధికారి పుల్లయ్య పాల్గొన్నారు.