నిర్మల్ అర్బన్, ఏప్రిల్ 7 : స్వరాష్ట్రంలోనే ఆలయాలకు మహర్దశ వచ్చిందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని బంగల్పేట్ మహాలక్ష్మీ అమ్మవారి ఆలయాన్ని శుక్రవారం దర్శించుకున్నారు. ముందుగా ఆలయానికి వచ్చిన మంత్రికి వేదపండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో మం త్రి ప్రత్యేక పూజలు చేశారు. ఈసందర్భంగా ఆయ న మాట్లాడారు. కోట్లాది రూపాయలు వెచ్చిస్తూ నిరాదరణకు గురైన ఆలయాలకు పూర్వ వైభవం తీసుకొచ్చామని చెప్పారు. ప్రతీ ఊరిలో ఆలయాలను నిర్మించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక రమణ, ఎఫ్ఏస్సీఎస్ చైర్మన్ దర్మాజీ రాజేందర్, కౌన్సిలర్ బిట్లింగ్ నవీన్, అల్లోల దివ్యారెడ్డి నాయకులు తదితరులున్నారు.
అంబలి పంపిణీ ప్రారంభం
జిల్లా కేంద్రంలోని విశ్రాంతి భవనం ఎదుట పాకాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాకాల రాంచందర్ ఏర్పాటు చేసిన ఉచిత అంబలి పంపిణీ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. మంత్రి స్వయంగా అంబలి పంపిణీ చేశారు. కొన్నేళ్లుగా ఉచితంగా అంబలి పంపిణీ చేస్తున్న పాకాలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈసందర్భంగా రాంచందర్‌ను అభినందించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ జీవన్ రెడ్డి, ప్రముఖ వ్యాపార వేత్త అల్లోల మురళీధర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ ఆకోజి కిషన్, దేవరకోట ఆలయ చైర్మన్ లింగంపల్లి లక్ష్మీ నారాయణ ఉన్నారు.
హజ్ యాత్రికులకు వైద్య పరీక్షలు
అన్ని వర్గాల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ద్యేయమని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఐఏ ఫంక్షన్ హాల్లో హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలకు ఏర్పాటు చేసిన వైద్యశిబిరాన్ని ప్రారంబించారు. ఈ సందర్భంగా మైనార్టీలకు ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను వివరించారు. అనతంరం కమిటీ సభ్యులు మంత్రిని సత్కరించారు.కార్యక్రమంలో, అబ్దుల్ రహమాన్, ఇంతియాజ్, అజీజ్, రాష్ట్ర హజ్ కమిటి మెంబర్ నజీరోద్దిన్ తదితరులున్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత
సోన్, ఏప్రిల్ 7 : ముఖ్యమంత్రి సహాయనిధి కింద మంజూరైన చెక్కులను రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తన నివాసంలో శుక్రవారం అందించారు. సోన్ మండలం లోకల్ వెల్మల్‌లో ఇద్దరికి, మాదాపూర్, సిద్ధులకుంట, జాఫ్రాపూర్, సాకెరలో ఒక్కొక్కరికీ ఈ సీఎంఆర్ఎఫ్ నుంచి ఆర్థిక సాయం మంజూరైంది. కార్యక్రమంలో బీఆర్ఎస్ సోన్ మండల కన్వీనర్ మోహినొద్దీన్, ప్రవీణ్, తదితరులున్నారు.