హైదరాబాద్, ఆట ప్రతినిధి : ఈజిప్టు వేదికగా జరిగిన పవర్‌లిఫ్టింగ్ ప్రపంచకప్‌లో తెలంగాణ లిఫ్టర్ పెరుమాళ్ల ప్రదీప్‌కుమార్ రజత పతకంతో మెరిశాడు. బుధవారం జరిగిన పురుషుల 85కిలోల మాస్టర్స్ కేటగిరీలో బరిలోకి దిగిన ప్రదీప్ మొత్తం 400కిలోలు ఎత్తి రెండో స్థానంలో నిలిచాడు.
అంతర్జాతీయ వేదికపై త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా రెపరెపలాడించాడు.