ఢిల్లీ : కడుపులో అస్వస్థత కారణంగా రెండ్రోజులు ఢిల్లీలోని హాస్పిటల్లో చికిత్స పొందిన టీమ్ఇండియా ఓపెనర్ అభిషేక్ శర్మ బుధవారం సాయంత్రం డిశ్చార్చి అయ్యాడు. అయితే అతడు గురువారం నమీబియాతో మ్యాచ్ ఆడుతాడా? లేదా? అన్నది మాత్రం తేలాల్సి ఉంది.
ఒకవేళ అభిషేక్ పూర్తిస్థాయిలో ఫిట్‌గా లేకుంటే మ్యాచ్‌లో అతడి స్థానాన్ని సంజూ శాంసన్ భర్తీ చేసే అవకాశముంది. బుధవారం ప్రాక్టీస్ సందర్భంగా బుమ్రా వేసిన యార్కర్‌తో ఇషాన్ కాలికి గాయమైనట్టు తెలుస్తున్నది. గాయం తీవ్రత గురించి బోర్డు ఎటువంటి ప్రకటనా చేయలేదు.