రైతులు పండించిన ప్రతి గింజా కొనుగోలు చేస్తామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సోన్ మండల కేంద్రంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి శుక్రవారం ప్రారంభించారు. కేంద్రం కొనకున్నా, తమ ప్రభుత్వం రైతులకు అన్యాయం జరగనివ్వదని స్పష్టం చేశారు. తడిసిన ధాన్యాన్నీ తీసుకుంటామని, ఏ ఒక్కరూ అధైర్య పడొద్దని భరోసానిచ్చారు. కాగా, పలువురు లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో సంక్షేమంపై పట్టింపే లేదని విమర్శించారు.
సోన్, మే 5 : రైతుల పక్షపాతిగా ఉండి ప్రతి గింజనూ కొనుగోలు చేసి రైతులకు తెలంగాణ ప్ర భుత్వం అండగా నిలుస్తున్నదని రాష్ట్ర అటవీ, ప ర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. సోన్ పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం మంత్రి ప్రారంభించా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్ర ప్రభు త్వం వరి ధాన్యాన్ని కొనుగోలు చేయబోమని చె ప్పినా రైతులకు ఏమాత్రం అన్యాయం జరగనివ్వద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనతో రాష్ట్ర ప్ర భుత్వం వరిని కొంటున్నదని చెప్పారు. అక్కడక్క డ వర్షాలు కురుస్తున్నందున తడిసిన ధాన్యాన్ని మొత్తం కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంద ని, రైతులు అధైర్యపడవద్దన్నారు. ఇప్పటికే ప్రభు త్వం మక్క కొనుగోళ్లను ప్రారంభించిందన్నారు. అనంతరం కుమ్రంభీం విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ చేశారు.
దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఆడపిల్లల పెండ్లికి రూపాయి ఇవ్వడం లేదని, బీజేపీ పాలిత రాష్ర్టం మహారాష్ట్రలో ఆడపిల్లల పెండ్లికి డబ్బులు ఇవ్వర ని, అక్కడ ఏదో ఇస్తున్నట్లు ఇక్కడి బీజేపీ నాయకులు గొప్పగా ఏమో ఇస్తామని చెప్పుకుంటున్నారని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. సోన్ మండల కేంద్రంలోని మున్నూరుకాపు సంఘ భ వనంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెం దిన 75 మంది లబ్ధిదారులకు మంజూరైన షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి చెక్కులను అందించారు. ఈ సం దర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బీజేపీ కండువా లు కప్పుకొని మన దగ్గరకు నాయకులు వచ్చినప్పుడు ఇలాంటి పథకాలు బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అమలు చేస్తున్నారా? అని నిలదీయాలన్నారు. నిర్మల్ జిల్లాలో నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ భవనం, బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాల ప్రారంభోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెలలోనే రానున్నారని, వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ప్రారంభోత్సవం చేయనున్నారని పేర్కొన్నారు. అనంతరం తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోన్ మండల ఐకేపీ వీవోఏలు మంత్రికి వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ జీవన్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ అంపోలి కృష్ణప్రసాద్‌రెడ్డి, సోన్ బీఆర్ఎస్ మండల కన్వీనర్ మోహినొద్దీన్, మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక రమణ, ఆత్మ చైర్మన్ గంగారెడ్డి, ఎఫ్ఏసీఎస్ మాజీ చైర్మన్ రాంకిషన్‌రెడ్డి, సోన్ సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు టీ వినోద్, డీఎస్వో తనూజ, ఆర్డీవో స్రవంతి, తహసీల్దార్ హిమబిందు, పీఏసీఎస్ డైరెక్టర్ బర్మదాసు, నాయకులు దాసరి శ్రీనివాస్, ప్రసాద్, వెంకాయిగారి శ్రీనివాస్‌రెడ్డి, జగన్, గంగాధర్, అంకం శ్రీనివాస్, అబూద్, వివిధ గ్రామాల స ర్పంచ్‌లు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
నిర్మల్ మండలంలోని మేడిపెల్లి గ్రామంలోని మక్క కొనుగోలు కేంద్రాన్ని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ప్రారంభించారు. మక్క పండించిన రైతుల కోసం ఈ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం ఛత్రపతి శివాజీ విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ ఎంపీపీ కొరిపెల్లి రామేశ్వర్‌రెడ్డి, ముఠాపూర్ పీఏసీఎస్ చైర్మన్ బోండ్ల గంగాధర్, వైస్ చైర్మన్ రాజారెడ్డి, సర్పంచ్ కుంట దుర్గ పద్మాకర్, ఎఫ్ఏసీఎస్ మాజీ చైర్మన్ రాంకిషన్‌రెడ్డి, సర్పంచ్ సూరపు సాయన్న, నాయకులు విలాస్, సాయారెడ్డి, ప్రవీణ్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
నిర్మల్ అర్బన్, మే 5 : జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేసవి ఉచిత శిక్షణ శిబిరాన్ని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ప్రారంభించారు. మొదటగా ఎన్సీసీ కెడెట్లతో గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం క్రీడాకారులకు దుస్తులను పంపిణీ చేశారు. కలెక్టర్‌తో సరదాగా.. చెస్, క్యారమ్ ఆడారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వరుణ్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, డీఈవో రవీందర్ రెడ్డి, ఆర్డీవో స్రవంతి, జడ్పీ సీఈవో సుధీర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ, నాయకులు గొనుగోపుల నర్సయ్య, అడ్ప పోశెట్టి తదితరులు పాల్గొన్నారు.
దిలావర్పూర్, మే 5 : కాల్వ లక్ష్మీ నరసింహుడి ఆలయం వద్ద అభివృద్ది పనుల కోసం రూ.కోటి మంజూరు చేశామని, ఈ పనులు మూడు నెలల్లో పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుక రావాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. కాల్వ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నృసింహుని కల్యాణానికి హాజరయ్యారు. స్వామి వారికి పట్టు వస్ర్తాలు సమర్పించారు. అనంతరం కల్యాణోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పండితులు, చైర్మన్లు మంత్రికి స్వామి వారి తీర్థప్రసాదాలు అందించి శాలువాతో సన్మానించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని కల్యాణోత్సవ మండపం, అన్నదాన కార్యక్రమం, పండితులకు ప్రత్యేక గదులు, వీఐపీ సూట్ల ఏర్పాటుకు రూ.కోటి మంజూరైనట్లు చెప్పారు. ఈ పనులు మూడు నెలల్లోనే పూర్తి చేయాలని దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ నిమ్మ చిన్నయ్య, బన్సపల్లి సహకార సంఘం చైర్మన్ పీవీ రమణారెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కొమ్ముల దేవేందర్‌రెడ్డి, పాల్ధే అనిల్, ఆడెపు శ్రీనివాస్, బాబురావు, పూజారం మహేశ్, ఒడ్నం కృష్ణ, రాంకిషన్‌రెడ్డి, పండితులు చక్రపాణి నరసింహమూర్తి, శ్రీమాన్ వాసుదేవాచార్యులు, శ్రీనివాస్, రాము, వెంకటేశ్, దేవాదాయ శాఖ డివిజనల్ ఇన్స్పెక్టర్ రవికిషన్‌గౌడ్, దేవాదాయ శాఖ అధికారులు మాధవరావు, కేశవులు, ఆలయ ధర్మకర్త కిషన్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
మామడ, మే 5 : మండల కేంద్రంలోని రైతు వేదికలో 82 మంది లబ్ధిదారులకు మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. కమల్‌కోట్, ఆదర్శనగర్ గ్రామాలను కలుపుతూ విద్యుత్ సబ్‌స్టేషన్ మంజూరైందని, త్వరలో పనులు ప్రారంభిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో స్రవంతి, డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్‌రెడ్డి, రైతు బంధు సమితి మండల కన్వీనర్ గంగారెడ్డి, బీఆర్ఎస్ మండల కన్వీనర్ చంద్రశేఖర్‌గౌడ్, ఎంపీడీవో రమేశ్, ఇన్చార్జి తహసీల్దార్ సంతోష్, సర్పంచ్ హన్మాగౌడ్, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి వికాస్‌రెడ్డి, బీఆర్ఎస్వై మండలాధ్యక్షుడు రమేశ్‌రెడ్డి, నిర్మల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ నల్ల లింగారెడ్డి, మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు భూమేశ్వర్, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.