ఎదులాపురం, ఏప్రిల్7: వేసవిలో పట్టణ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి చర్యలు తీసుకుంటున్నామని ఆదిలాబాద్ ఎమ్మె ల్యే జోగు రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని ఫిల్టర్‌బెడ్‌లో ఇటీవల పలు మరమ్మత్తు పనులను యుద్ధ ప్రాతిపదికన చేయిచారు. ఆధునీకరించిన పైప్‌లైన్ ద్వారా నీటి సరఫరాను మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్‌తో కలిసి శుక్రవారం ఆయన ప్రారంభించారు. ముందుగా ప్రస్తుత నీటి సామ ర్థ్యం, సరఫరా వంటి అంశాలపై ఆరా తీశారు. స్థానిక అధికారులు, సిబ్బందికి విస్తృత సూచనలు చేశారు. నీటి సరఫరాలో సమస్యలు ఉత్పన్నం కాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్ని వార్డులకు నిత్యం మంచి తాగు నీరు సరఫరా అయ్యేలా ఇంజినీరింగ్ మిషన్ భగీరథ అధికారులతో కలిసి ప్రణాళికాబద్ధంగా కార్యాచరణ అమలు చేస్తున్నట్లు వివరించారు. అక్కడక్కడా చిన్నపాటి ఇబ్బందులు తలెత్తినా వాటిని సత్వరమే పరిష్కరిస్తున్నామని స్పష్టం చేశారు. మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, కమిషనర్ శైలజ, కౌన్సిలర్ అశోక్‌స్వామి, ఆవుల వెంకన్న, ప్రకాశ్, లక్ష్మణ్, బీఆర్ఎస్ మహిళా విభాగం పట్టణ అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు స్వరూపారాణి, బొడగం మమత పాల్గొన్నారు.
మండలంలోని కరంజీలో సంత్ శ్రీ బాజీరావు బాబా పుణ్యతిథి నిర్వహించారు. బాజీ రావు బాబా సప్తాహ ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. బాజీరావు శిష్యులు ఏటా సప్తాహ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో భక్తి భావన పెంచుతున్నారన్నారు. తుక్డో జి మహారాజ్ తెలిపిన గ్రామ్గీత్ ద్వారా గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత, పాటలు, గేయాల ద్వారా తెలియజేశారన్నారు. అంతకు ముందు ఎమ్మెల్యే జోగు రామన్నను నాయకులు, భక్తులు సత్కరించారు. కార్యక్రమంలో ల్రైబరీ చైర్మన్ రాహుత్ మనోహార్, ఎంపీపీ మార్శెట్టి గోవర్ధన్, ఆర్బీఎస్ మండల అధ్యక్షుడు లింగారెడ్డి, మాజీ సర్పంచ్ నూతుల మహేందర్ రెడ్డి, సర్పం చ్ రతన్‌రెడ్డి, అశోక్, నర్సింగ్‌రెడ్డి ,సామాజిక కార్యకర్త బండారు దేవన్న పాల్గొన్నారు.
ఓట్లు దండుకునేందుకే కుట్రలు
ఎదులాపురం, ఏప్రిల్7: మతం పేరిట ఓట్లు దండుకునేందుకు బీజేపీ కుట్రలకు తెరలేపుతున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో బేడ బుడగ జంగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పసుపుల రాజుతో పాటు రాంనగర్‌కు చెందిన బీజేపీ ,కాంగ్రెస్ నాయకులు, మహిళలు, యువకులు బీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే జోగు రామన్న వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని, ఆ పార్టీకి అన్ని వర్గాలు దూరమవుతున్నాయన్నారు. ఎంపీపీ గండ్రత్ రమేశ్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండారి సతీశ్, నాయకులు పసుపల రాజేశ్, అశోక్, సతీశ్ యాదవ్, రమణ, లక్ష్మి, స్వప్న, గంగమ్మ, సుశీల, గంగారావు పాల్గొన్నారు.