బేల, అక్టోబర్ 20 : ఎన్నికల వేళ గ్రామాల్లోకి మో సగాళ్లు వస్తున్నారని, వారి మాయమాటలు నమ్మి మోసపోవద్దని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామ న్న కోరారు. మండలకేంద్రంలో శుక్రవారం ఏర్పా టు చేసిన ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజయ్యారు. ఈ సందర్భంగా సిర్సన్న గ్రామం నుంచి పెద్ద ఎత్తున బైక్ ర్యాలీగా బయలుదేరి సదల్‌పూర్‌లోని బైరాందేవ్, మహాదేవ్ ఆ లయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మండలకేంద్రంలోని కుమ్రం భీం, అంబేద్కర్, ఐలమ్మ, శివాజీ మహారాజ్ విగ్రహాలకు పూ లమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం మండలకేంద్రంలోని గార్డెన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా మళ్లీ తనను గెలిపిస్తే మరో ఐదేళ్ల పా టు మీ పాలేరుగా పని చేస్తానని హామీనిచ్చారు. ఆదిలాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రా వుత్ మనోహర్, డీసీసీబీ చైర్మన్ ఆడ్డి భోజారెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కల్యాం ప్రమోద్ రె డ్డి, బీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు గంభీర్‌ఠాక్రే, బీ ఆర్ఎస్ నాయకులు జక్కుల మధూకర్, సతీశ్‌పవార్, త న్వీర్ఖాన్, దేవన్న, వట్టిపెల్లి ఇంద్రశేకర్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, గ్రామ కమిటీ అధ్యక్షుడు , కార్యకర్తలు, యువకులు పాల్గొన్నారు.
జైనథ్, అక్టోబర్ 20 : ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న శుక్రవారం బేల మండలంలో ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా జైనథ్ మండలంలోని భో రజ్లో గల ఓ టీ స్టాల్ వద్ద ఆగి చాయ్ తాగాడు. అక్కడే ఉన్న ప్రజలను ఆప్యాయంగా పలుకరించారు. సోయా పంట దిగుబడిని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తుమ్మల వెం కట్ రెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ ఎస్.లింగారెడ్డి, మార్కెట్ మాజీ చైర్మన్ యాసం నర్సింగ్‌రావ్, కిష్టారెడ్డి, పాల్గొన్నారు.
ఎదులాపురం,అక్టోబర్ 20 : జిల్లాకేంద్రంలోని మానవ హక్కుల సంఘం సభ్యుడు రాజ్సిద్ధర్ మానవసేవ మధవ సేవ సభ్యుడు కే రవికుమార్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జోగు రామన్న సమ క్షంలో 200 మంది బీఆర్ఎస్లో చేరారు. వారికి ఆయన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, పట్టణాధ్యక్షుడు అ లాల్ అజయ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ య సం నర్సింగ్‌రావు, వార్డు కౌన్సిలర్ భరత్ కుమా ర్, పట్టణ కార్యదర్శి కరుణ, జిల్లా కార్యవర్గ సభ్యు లు సుల్తన్ పర్వీనా, పట్టణ కార్యదర్శి అష్రఫ్, అ ధికార ప్రతినిధి గంగారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు ఇజ్జగిరి నారాయణ, బీసీ పట్టణాధ్యక్షుడు దాసరి రమేశ్, పట్టణ ఉపాధ్యక్షుడు దివిటి రాజు, నా యకులు మిషు, ధమ్మపాల్, సృజన్ రెడ్డి, కేఆర్కే వార్డు అధ్యక్షుడు ఆశన్న, పార్టీలో చేరిన వారిలో మహేశ్, కిరణ్, రవికుమార్, అనిల్, అజయ్, సంతోష్, నగేశ్, శేఖర్ తదితరులు ఉన్నారు.