ఆదిలాబాద్, అక్టోబర్ 11(నమస్తే తెలంగాణ): ఆదిలాబాద్ బీడీఎన్టీ ఐటీ కంపెనీలో వసతుల కల్పనకు రూ.1.50 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. సెప్టెంబర్ 26న ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా బీడీఎన్టీ ల్యాబ్‌ను ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సందర్శించారు. కంపెనీ ప్రభుత్వ భవనంలో కొనసాగుతుండగా.. కొన్ని వసతులు అవసరమని నిర్వాహకులు తెలిపారు. వెంటనే స్పందించిన మంత్రి విద్యుత్ సరఫరా, భవనం ఆధునీకరణకు నిధులు మంజూరు చేస్తామని, మూడు నెలల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. తాజాగా.. రూ.1.50 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మంత్రి కేటీఆర్‌కు మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ కృతజ్ఞతలు తెలిపారు.