బజార్హత్నూర్, మార్చి 3 : గ్రామీణ క్రీడలను ప్రోత్సహించడం అభినందనీయమని ఎస్పీ ఉదయ్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని జాతర్ల గ్రామంలోని మినీ స్టేడియంలో నిర్వహించిన అంతర్రాష్ట్ర క్రీడా పోటీలు బుధవారం రాత్రి ముగిశాయి. కబడ్డీ, వాలీబాల్, బ్యాడ్మింటన్ పోటీల్లో మహారాష్ట్ర, తెలంగాణలోని పలు జిల్లాల క్రీడాకారులు పాల్గొని ప్రతిభ కనబర్చారు. వారికి మాజీ ఎంపీ నగేశ్ ఆధ్వర్యంలో ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి బహుమతులు అందజేశారు. నవజ్యోతి యూత్ క్లబ్ సభ్యులు ఎస్పీ, మాజీ ఎంపీని శాలువాతో సన్మానించారు. అనంతరం 50 ఏళ్ల నుంచి ఈ పోటీల ప్రస్తానంలో సాగిన విజయాలతో రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ పురుషోత్తమాచారి, బోథ్ ఎంపీపీ తుల శ్రీనివాస్, జడ్పీటీసీలు జాదవ్ అనిల్, తాటిపెల్లి రాజు, బజార్హత్నూర్ పీఏసీఎస్ చైర్మన్ మేకల వెంకన్న, టీఆర్ఎస్ నాయకులు రమణ, గణేశ్, కృష్ణకుమార్, నవజ్యోతి యూత్ క్లబ్ సభ్యులు చందన్, కళ్యాణ్, శ్రీకాంత్, గ్రామస్తులు పాల్గొన్నారు.