బేల, ఫిబ్రవరి3 : కార్పొరేట్లకు మేలు చేకూర్చేందుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టినట్లుగా ఉందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. మండల కేంద్రంలోని సబ్ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని గురువారం ప్రారంభించారు. మార్కెట్ యార్డుకు ముందుగా కందులు తీసుకువచ్చిన మొదటి రైతును ఎమ్మెల్యే సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రజాసంక్షేమాన్ని విస్మరించిందని ఆరోపించారు.
రైతు కూలీలకు, నిరుద్యోగులకు ప్రాధాన్యమివ్వలేదని మండిపడ్డారు. కందులను క్వింటాలకు రూ. 6300 మద్దతు ధరతో కొనుగోలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సహకరించకున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుకు ఎటువంటి లోటు రాకుండా పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగుతున్నారని స్పష్టం చేశారు. బేల సబ్‌మార్కెట్ యార్డులో రూ. 92 లక్షలతో నిర్మిస్తున్న ఓపెన్ షెడ్ పనులను పరిశీలించారు. యార్డు పక్కన రోడ్డు విస్తరణ పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని డీఈకి ఫోన్ చేసి సూచించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్, ఎంపీపీ వనిత ఠాక్రే, సర్పంచ్ వట్టిపెళ్లి ఇంద్రశేఖర్, టీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు గంభీర్ ఠాక్రే, ఆడనేశ్వర్ ఫౌండేషన్ చైర్మన్ సతీశ్ పవర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కే ప్రమోద్ రెడ్డి, నాయకులు పురుషోత్తం, బండి సుదర్శన్, బత్తుల సుధాం, పీఏసీఎస్ చైర్మన్ బాలచందర్, జితేందర్, నాయకులు కిషన్ వైద్య, తన్వీర్‌ఖాన్ , సంతోష్ బెదుడ్కర్, మార్కెట్పెఢ్ డీఏం, ఏడీఏ పుల్లయ్య, సర్పంచులు, రైతులు పాల్గొన్నారు.
సీసీఐని పునరుద్ధరించే దాకా పోరాటం చేస్తామని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న తెలిపారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడారు. సీసీఐ సాధన సమితి చేపట్టిన బంద్‌కు టీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. పట్టణ ప్రజలు బంద్‌కు మద్దతు తెలపాలని కోరారు. సీసీఐ పునఃప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అనేక సార్లు కేంద్రంలో కేంద్రప్రభుత్వానికి లేఖలు రాసిన పట్టించుకోలేదన్నారు. సీసీఐని పునరుద్ధరిస్తే జిల్లా యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. త్వరలోనే చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. సమావేశంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మున్సిపల్ వైస్‌చైర్మన్ జహీర్ రంజానీ, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు అజయ్, కౌన్సిలర్ భరత్‌కుమార్, చందాల రాజన్న పాల్గొన్నారు.
సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం చేపట్టిన ఆదిలాబాద్ పట్టణ బంద్‌కు అన్ని వర్గాలు మద్దతు తెలిపాయని సీసీఐ సాధన కమిటీ కన్వీనర్, కో కన్వీనర్లు దర్శనాల మల్లేశ్, విజ్జగిరి నారాయణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు, వ్యాపార, వాణిజ్య వర్గాలు, ఆటోయూనియన్, కార్మిక సంఘాలు, విద్యాసంస్థలు, ప్రభు త్వ రిటైర్డ్ ఉద్యోగు సంఘం, టీఎమ్మార్పీఎస్, జిల్లా యువజన సంఘాల సంక్షేమ సమితి, టీఆర్ఎస్, కాంగ్రెస్, దళిత సంఘాలు, చిరు వ్యాపారులు పూర్తి మద్దతు ప్రకటించారని పేర్కొన్నారు.