“ఏడు దశాబ్దాలు పాలించిన టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాయి. స్వరాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ వందల కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. ఎటు చూసినా అద్దల్లాంటి రహదారులు, పచ్చదనాన్ని పరుస్తున్న చెట్లు, దుర్వాసనలేని డ్రైనేజీలు దర్శనమిస్తున్నాయి.” అని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ మండలంలోని కొండాపూర్‌లో సుమారు రూ.2 కోట్లతో సీసీ, బీటీ రోడ్డు, అంగన్వాడీ భవనం, హనుమాన్ ఆలయ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.4 లక్షలతో నిర్మించిన బస్‌షెల్టర్‌ను ప్రారంభించారు.
సోన్, మే 26 : తెలంగాణ రాష్ట్రం వచ్చాక చేపట్టిన అభివృద్ధిని చూడండి.. గత పాలకుల అభివృద్ధిని పోల్చి చూడండి.. గ్రామాభివృద్ధికి ప్రభుత్వం ప్రతినెలా డబ్బులు ఇవ్వడం వల్లే గ్రామాలన్నీ సుందరంగా, అందంగా కళకళలా డుతున్నాయి. అద్భుతంగా పని చేస్తున్న ప్రభుత్వా న్ని ప్రజలు ఆశీర్వదించాలని అటవీ, పర్యావ రణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర కరణ్‌రెడ్డి పిలుపునిచ్చారు.
నిర్మల్ మండలం కొండాపూర్ గ్రామంలోని సుమారు రూ. 2 కోట్లతో చేపట్టిన సీసీ రోడ్లు, బీటీ రోడ్డు, అంగన్ వాడీ భవనం, హనుమాన్ ఆలయ నిర్మాణానికి భూమిపూజ, ప్రారంభోత్సవాలు మంత్రి నిర్వ హించారు. గ్రామానికి చెందిన సర్పంచ్ నవాత్ గంగాధర్, సోన్ ఎంపీడీవో సాయిరాం వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం రూ. 4 లక్షలతో నిర్మించి న బస్‌షెల్టర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 8 ఏళ్ల కాలంలో తెలంగాణ ప్రభుత్వంలో పల్లెలు ప్రగతిపథంలో నడుస్తుంటే అది చూడలేక కేంద్ర ప్రభుత్వం నిధుల్లో కోత విధిస్తున్నదని మండిపడ్డారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్ధ్దానాన్ని నిలబెట్టుకుందని, త్వరలో 57 ఏళ్లు నిండిన వారికి పింఛన్లు, సొంత స్థలం ఉంటే ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీనిచ్చారు. ప్రజలు కూడా ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ప్రయోజనం పొందాలన్నారు. నిర్మల్ ఎంపీపీ రామేశ్వర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ నర్మదా ముత్యంరెడ్డి, మాజీ ఎఫ్ఏసీఎస్ చైర్మన్ రాంకిషన్‌రెడ్డి, ఆర్డీవో తుకారాం, తహసీ ల్దార్ ప్రభాకర్, వ్యాపారవేత్త అల్లోల మురళీధర్ రెడ్డి, సర్పంచ్‌లు, ప్రజలు పాల్గొన్నారు.
నిర్మల్ పట్టణం మంజులాపూర్లోకి మార్చిన ప్రాథమిక సహకార సంఘ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు జీలుగ విత్తనాలను అంద జేశారు. పీఏసీఎస్ చైర్మన్ అంపోలి కృష్ణప్రసాద్ రెడ్డి, డీసీవో శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి అంజిప్రసాద్, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, ఆత్మ చైర్మన్ గంగారెడ్డి, పీఏసీఎస్ ఛైర్మన్ రమణారెడ్డి, వ్యవసాయశాఖ అధికారి వసంత్ రావు, ప్రవీణ్‌కుమార్, సోన్ టీఆర్ఎస్ మండల కన్వీనర్ మొహినొద్దీన్, నాయకులు సాయన్న, మురళీధర్‌రెడ్డి, చెనిగారపు నరేశ్, లింగారెడ్డి, బర్మ దాస్, మోహన్‌రెడ్డి, ఏఈవో హర్షిత, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు మల్లేశ్, జిల్లా సహకార సీఈవో మురళి, తదితరులున్నారు.
నిర్మల్ అర్బన్, మే 26 : ఐకేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగార్థులకు పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ స్థాయి ఉద్యోగాలకు ఉచిత శిక్షణను అంది స్తున్నామని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవా దాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొ న్నారు. శిక్షణ పొందుతున్న 250 మంది ఉద్యోగా ర్థులకు పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాల యంలో ఉచితంగా స్టడీ మెటీరియల్‌ను గురువా రం మంత్రి అందజేశారు.
ఈసందర్బంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం నిరుద్యోగులకు కోసం దశల వారీగా ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు జారీ చేస్తున్నదని పేర్కొన్నారు. ప్రభుత్వం తాజా గా 80 వేల ఉద్యోగాలను భర్తీ చేయనుందని తెలిపారు. జిల్లాకు చెందిన అభ్యర్థులు పెద్ద సంఖ్య లో ఉద్యోగాలు సాధించాలని సూచించారు. ఉద్యోగమే లక్ష్యంగా కష్టపడి చదివి జిల్లా పేరును నిలబెట్టి తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలన్నా రు. ఐకేఆర్ ఫౌండేషన్ నిర్వాహకులు నర్సారెడ్డి, చాణక్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ బర్ల జనార్దన్ రెడ్డి తదితరులున్నారు.
దిలావర్పూర్, మే 26 : లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధికి రూ. కోటీ నిధులు మంజూరు చేయనున్నట్లు మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. కాల్వ లక్ష్మీనరసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ముగియడంతో తీర్థ ప్రసాదా లను ఆలయ చైర్మన్, దేవాదాయ శాఖ అధికారు లు మంత్రిని కలిశారు. శాలువాతో సన్మానించి తీర్థ ప్రసాదాలు అందించారు.
కోనేరు ను ఆధునీ కరించేందుకు, నిర్మల్ భైంసా 61 జాతీయ రహ దారి నుంచి ఆలయానికి వెళ్లే రోడ్డు పై రూ. 50 లక్షలతో రాజగోపురం, గ్రామంలో నుంచి ఆల యానికి వచ్చే దారిలో మరో రాజ గోపురం నిర్మిం చేందుకు నిధులు త్వరలోనే మంజూరు చేస్తామని పేర్కొన్నారు. ఆలయ చైర్మన్ నిమ్మ చిన్నయ్య, దేవాదాయ డివిజనల్ ఇన్స్పెక్టర్ రవికిషన్‌గౌడ్, సహకార సంఘం చైర్మన్ పీవీ రమణారెడ్డి, ఈవో సదయ్య, రాము, ఎస్పీ కిషన్, వుజారం మహేశ్, అర్చకులు శ్రీనివాస్, వెంకటేశ్ తదితరులున్నారు.