ఎదులాపురం, అక్టోబర్ 14 : ఎంపికైన ప్రతి విద్యార్థి పాఠశాలలో ఉండాలని, సమస్యల పరిషారంపై ఆయా పాఠశాలల యాజమాన్యాలతో చర్చించి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి సాంఘిక, గిరిజన, మైనారిటీ సంక్షేమ శాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల సంక్షేమ శాఖల అధికారులతో బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంక్షేమంపై సమీక్ష నిర్వహించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. ఈ విద్యా సంవత్సరం ఆటంకం లేకుండా విద్యా బోధన కొనసాగించాలని సూచించారు. వీసీలో కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని ఏడు సూల్స్‌లో 425 మంది చదువుతున్నారన్నారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో సమావేశాలు నిర్వహించి దిశానిర్దేశం చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి సునీత, జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణను రానున్న రోజుల్లో అభివృద్ధి, సం క్షేమ రంగంలో అగ్రగామిగా నిలబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ విజన్-2047 డాక్యుమెంట్‌ను రూపొందిస్తున్నదని కలెక్టర్ రాజర్షి షా మంగళవారం ఒక ప్రకటన లో తెలిపారు. ఇందులో ప్రతి పౌరుడు భాగస్వామ్యం పొందేలా సిటిజన్ సర్వే చేస్తున్నారన్నారు. అక్టోబర్ 10న ప్రారంభమైన ఈ సర్వే లో ప్రజలు, ఎన్ఆర్ఐలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారన్నారు. ఇందులో ప్రతి ఉద్యోగి సలహాలు, సూచనలు అందించాలన్నారు.
– ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా