ఎదులాపురం, మే 4 : ఎంబీబీఎస్ ప్రవేశాల కోసం ఆదివా రం నిర్వహించిన నీట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జిల్లా కేంద్రంలో 1,659 మం ది అభ్యర్థుల కోసం ఏడు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో 1621 మంది హాజరు కాగా.. 38 మంది గైర్హాజరయ్యా రు. మొత్తంగా 97.75 శాతం హాజరయ్యారు. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. కా గా అభ్యర్థులను ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు అనుమతించారు.
అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి కేంద్రాల్లోకి పంపించారు. బయోమెట్రిక్, గుర్తింపు కార్డులు, హాల్ టికెట్లను పరిశీలించారు. గడియారాలు, ఇతర వస్తువులను నిషేధించారు. కొందరి చెవి కమ్మలు, చేతుల గాజులు తీసేసి వారితోపాటు వచ్చిన వారికి ఇచ్చారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో ఏఎస్పీ సురేందర్‌రావు, డీఎస్పీ జీవన్‌రెడ్డి బందోబస్తు నిర్వహించారు. బాలికల ఉన్నత పాఠశాలలో ఓ అభ్యర్థి సమయం దాటి రావడంతో అధికారులు ఆమెను అనుమతించలేదు. కేంద్రాలను కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్లు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నీట్ ప్రశాంతంగా కొనసాగిందన్నారు.