ఎదులాపురం, మార్చి 21: పదవ తరగతి వా ర్షిక పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 10,043 మంది విద్యార్థులకు గాను 52 పరీ క్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అన్ని కేం ద్రాల వద్ద 163 బీఎన్ఎస్ఎస్ యాక్ట్ (144 సెక్షన్)ను అమలు చేశారు. సమీపంలోని జిరా క్స్ సెంటర్లను మూసి వేయించారు. పరీక్ష సమయం కంటే గంట ముందు నుంచే విద్యార్థులను లోనికి అనుమతించారు. ఎండల దృ ష్ట్యా తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్ల, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు. తొలి రోజు పరీక్షకు 10,013 మంది హాజరు కాగా 30 మంది గైర్హాజరైనట్లు ఆదిలాబాద్ డీఈవో ప్రణిత తెలిపారు. విద్యానగర్‌లో జడ్పీ ప్రాథమిక పాఠశాల, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా పరిశీలించారు. పరీక్ష నిర్వహణపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయన వెంట శిక్షణ కలెక్టర్ అభిగ్యాన్ మాలవీయ, అధికారులున్నారు. లిటిల్ స్టార్‌లోని సెంటర్‌ను ఎస్పీ అఖిల్ మహాజన్ పరిశీలించారు. బందోబస్తుపై పోలీసులకు పలు సూచనలు చేశారు.
నిర్మల్ అర్బన్/సోన్ /భైంసా, మార్చి, 21 : నిర్మల్ జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఉదయం గంట ముందు నుంచే కేంద్రాల్లోకి విద్యార్థుల హాల్‌టికెట్లను తనిఖీ చేసి లోనికి పంపించారు. అన్ని కేంద్రాల వద్ద 163 బీఎన్ఎస్ఎస్ యాక్ట్ (144 సెక్షన్) అమలు చేశారు. నిర్మల్ పట్టణంలోని రవి ఉన్నత పాఠశాల, సోన్‌లోని జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలోని పరీక్షా కేంద్రాలను కలెక్టర్ అభిలాష అభినవ్ పరిశీలించారు. విద్యార్థులకు తాగునీటి వసతి, టాయిలెట్లు, వైద్య సదుపాయాలపై ఆరా తీసి పలు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట డీఈవో రామారావు, అధికారులున్నారు. పలు పరీక్షా కేంద్రాలను ఏఎస్పీ రాజేశ్ మీనా, సీఐ ప్రవీణ్ కుమార్‌తో కలిసి తనిఖీ చేశారు. భైంసా పట్టణంలో బాలికల ఆశ్రమ పాఠశాలలోని పరీక్షా కేంద్రాన్ని జిల్లా ఎస్పీ జానకీ షర్మిల పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లా వ్యాప్తంగా అన్ని సెంటర్ల వద్ద 163 బీఎన్ఎస్ఎస్ యాక్ట్ 2023ను పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఎస్పీ వెంట ఏఎస్పీ అవినాశ్ కుమార్, సీఐలు గోపీనాథ్, నైలు, తదితరులు ఉన్నారు.