e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home ఆదిలాబాద్ గొల్లకుర్మల ఆర్థిక బలోపేతానికి కృషి

గొల్లకుర్మల ఆర్థిక బలోపేతానికి కృషి

గొల్లకుర్మల ఆర్థిక బలోపేతానికి కృషి

ఖానాపూర్‌ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్‌
రెండోవిడుత గొర్రెల పంపిణీ

ఖానాపూర్‌ రూరల్‌, ఏప్రిల్‌ 11 : తెలంగాణ సర్కారు గొల్ల కుర్మల ఆర్థిక బలోపేతానికి కృషిచేస్తున్నదని ఖానాపూర్‌ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్‌ స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టిందన్నారు. ఖానాపూర్‌ మండలంలోని మస్కాపూర్‌, దిలావర్‌పూర్‌ గ్రామాల్లో ఆదివారం గొల్ల కుర్మలకు రెండోవిడుత గొర్రెల పంపిణీని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మూడేళ్ల కిత్రం నుంచి డీడీలు చెల్లించి, ఎదురుచూస్తున్న గొల్లకుర్మల కండ్లలో ఆనందం కనిపించిందన్నారు. మస్కాపూర్‌లో 16 యూనిట్లు, దిలావర్‌పూర్‌లో 3 యూనిట్ల గొర్రెలను లబ్ధిదారులకు అందించినట్లు ఆమె చెప్పారు. వేర్వేరుగా నిర్వహించిన కార్యక్రమాల్లో మున్సిపల్‌ చైర్మన్‌ అంకం రాజేందర్‌, ఎంపీపీ మోహిద్‌, జడ్పీటీసీ ఆకుల రాజమణి, వెంకాగౌడ్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు రాజగంగన్న, ప్రధాన కార్యదర్శి తూము చరణ్‌, నాయకులు బక్కశెట్టి కిశోర్‌, ద్యావత్‌ రాజేశ్వర్‌, పుప్పాల గజేందర్‌, శోభన్‌, రాజారెడ్డి, మిర్యాల ప్రతాప్‌రావ్‌, వెంకటేశ్‌, కరిపె శ్రీనివాస్‌, అడిదెల మధు, రాపెల్లి రవి, ఎర్రన్న, రాచర్ల శ్రీనివాస్‌, లక్ష్మణ్‌, డబ్బా శ్రీనివాస్‌, పార్శపు శ్రీనివాస్‌, సల్ల మల్లేశ్‌, సల్ల శ్రీనివాస్‌, సల్ల రాజు, మహేశ్‌, సాయి, లింగన్న గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
గొల్లకుర్మల ఆర్థిక బలోపేతానికి కృషి

ట్రెండింగ్‌

Advertisement