కెరమెరి, జూలై 3 : రైతులకు ఎరువులు, విత్తనాలు అధిక ధరలకు విక్రయిస్తే డీలర్లపై కేసు లు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకుంటామని ఆసిఫాబాద్ అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డేవిడ్ అన్నారు. కెరమెరి మండల కేంద్రంలో ని పలు విత్తనాలు, ఎరువుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేసి స్టాకు రిజిస్టర్లు, గో దాంలు, తూకం యంత్రాలు, రసీదు పుస్తకాలను పరిశీలించారు. జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వ గుర్తింపు కలిగిన ఎరువులు, విత్తనాలు నిర్దేశించిన ధరలకు మాత్రమే విక్రయించాలని సూచించారు. దుకాణం ముందు స్టాకు నిల్వ, ధరల ప ట్టిక వివరాలు తప్పనిసరిగా ప్రదర్శించాలని, యూరియా, డీఏపీ, ఇతర మందులు, విత్తనాలను ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయించాలని ఆదేశించారు.
ప్రతిరోజూ స్టాకు వివరాలను సమర్పించాలని, జిల్లాలో వ్యవసాయ సాగుకు అవసరమైన యూరియా, డీఏపీ కొరత లేకుండా వ్యవసాయ శాఖ అధికారులు పర్యవేక్షించాలన్నారు. రైతుల నుంచి ఫిర్యాదులు వస్తే తక్షణమే స్పందించి చర్యలు తీసుకుంటామని, నకిలీ, నిషేధిత విత్తనాలు, ఎరువుల విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సహాయ సంచాలకుడు వెంకటి, తహసీల్దార్ భూమేశ్వర్, ఏవో యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.