ఆదిలాబాద్: రాష్ట్రంలో యూరియా (Urea) కోసం రైతన్నల తండ్లాటలు కొనసాగుతూనే ఉన్నాయి. పంటను కాపాడుకునేందుకు అన్నదాతలు పడరానిపాట్లు పడుతున్నారు. ఇటీవల ఆదిలాబాద్ జిల్లాలో కురిసిన వానలతో పత్తి పంట బాగా దెబ్బతిన్నది. చేనుల్లో నీరు నిలువడంతో రైతులు పంటను కాపాడుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా పంట ఎదుగుదల కోసం యూరియాను వినియోగిస్తున్నారు. అధికారులు డిమాండ్‌కు సరిపడా యూరియా సరఫరా చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. మంగళవారం ఉదయం తలమడుగు మండలం కుచిలాపూర్కు యూరియా స్టాక్ వచ్చిందని తెలుసుకున్న రైతులు.. సొసైటీ ముందు పట్టా పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డుతో లైనులో నిలబడ్డారు.