మంచిర్యాలటౌన్, మే 1: ఈ నెల 4న బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మం చిర్యాలలో నిర్వహించనున్న రోడ్ షో రూట్‌మ్యాప్, చేపట్టాల్సిన ఏర్పాట్లను బుధవారం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ విప్ బాల్కసుమన్, మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు పరిశీలించారు. ఈ నెల 4న సాయంత్రం ఐదుగంటలకు గోదావరిఖని నుంచి శ్రీరాంపూర్ మీదుగా మంచిర్యాలకు చేరుకుంటారు. ఓవర్ బ్రిడ్జి కిందకు దిగిన తర్వాత ప్రజలకు అభివాదం చేస్తూ ఐబీ చౌరస్తా (అంబేద్కర్ చౌరస్తాలో)లో రోడ్ షోలో ప్రచారం చేయనున్నారు. దాదాపు 40 వేల మంది జనాలు తరలిరానున్నారని మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ యూత్ నాయకుడు నడిపెల్లి విజిత్‌రావు, కౌన్సిలర్ గాదెసత్యం, బీఆర్ఎస్ నాయకులు శ్రీరాముల మల్లేశ్, తాజుద్దీన్, కర్రు శంకర్, పాల్గొన్నారు.