కాసిపేట : ఈ ఏడాది సింగరేణి లాభాలను (Singareni profits ) వెంటనే ప్రకటించి 35శాతం వాటాను కార్మికులకు చెల్లించాలని ఏఐటీయూసీ( AITUC ) నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలోని కాసిపేట గని ( Kasipeta Mine) 2 ఇంక్లైన్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని గని మేనేజర్ లక్ష్మీ నారాయణకు అందజేశారు.
ఏఐటీయూసీ పిట్ సెక్రెటరీ గొల్ల శ్రీనివాస్ ( Golla Srinivas ) మాట్లాడుతూ కార్మికులకు సొంత ఇంటి పథకాన్ని అమలు చేయాలని, మెడికల్ చార్జ్ పేరిట కార్మికుల నుంచి వసూలు చేసిన డబ్బులను తిరిగి చెల్లించాలని కోరారు. ఇక ముందు కూడా రికవరీలు నిలిపివేయాలన్నారు. కాసిపేట 2 ఇంక్లైన్లో రెస్ట్ హాల్స్ లాకర్ సదుపాయాలు ఏర్పాటు చేయాలని, నాణ్యమైన పని ముట్లు, బాట కంపెనీ బూట్లు, హ్యాండ్ బ్లౌజులు కార్మికులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో పిట్ కమిటీ ఉపాధ్యక్షులు కొండపల్లి నర్సయ్య, అసిస్టెంట్ ఫిట్ సెక్రెటరీ బొద్దుల వెంకటేష్, కమిటీ సభ్యులు జావీద్, దేవులపల్లి శ్రీనివాస్, కొమరయ్య, రవి, సాగర్, లింగమూర్తి, అంజద్ ఖాన్, లక్ష్మీ నారాయణ, నరేష్, సోమేశ్వర్, మణికంఠ, మనోజ్ యాదవ్, మహేష్, కిరణ్, కార్మికులు పాల్గొన్నారు.