Imprisonment | చింతలమనేపల్లి, ఫిబ్రవరి 18 : వికలాంగురాలిపై అత్యాచార యత్నం చేసిన వ్యక్తికి మూడు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ ఆసిఫాబాద్ జిల్లా అసిస్టెంట్ సెషన్స్ జడ్జి కోర్ట్ న్యాయమూర్తి యువరాజు తీర్పు ఇచ్చారు. కౌటల సీఐ ముత్యం రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. చింతలమనేపల్లి మండలంలోని బాలాజీ అనుకోడ గ్రామానికి చెందిన ఓ వికలాంగురాలిపై 18/04/2023 రోజున అదే గ్రామానికి చెందిన కామెర శంకర్ (40) అనే వ్యక్తి అత్యాచార యత్నం చేయబోయాడు. బాధితురాలు కేకలు వేయడంతో నిందితుడు పరుగులు తీశాడు.
ఈ క్రమంలో వారి కుటుంబ సభ్యులు నిందితుడిని శంకర్‌గా గుర్తించారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే గ్రామంలో తమ పరువు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టారు.
విచారణ జరిపిన న్యాయమూర్తి నేరం రుజువు కావడంతో కామెర శంకర్‌కు మూడు సంవత్సరాల జైలు శిక్ష, రూ. 9000 జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. ప్రాసిక్యూషన్ తరపున పీపీ జీవీఎస్ ప్రసాద్ వాదించారు. నిందితుడికి శిక్ష పడటంలో కృషిచేసిన కోర్ట్ లైజనింగ్ ఆఫీసర్ రాంసింగ్ ఎ.ఎస్.ఐ,సి.డి.ఓ బాలాజీ ఏ.ఎస్.ఐ లను జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు అభినందించారు.
Mazaka | సందీప్ కిషన్ మజాకా టీం క్రేజీ ప్లాన్.. రావులమ్మ సాంగ్ లైవ్ ఫిల్మ్ షూట్ చూశారా..?
Chhaava: విక్కీ కౌశల్ ఛావా కొత్త రికార్డు.. 3 రోజుల్లో 164 కోట్లు వసూల్