Mazaka | టాలీవుడ్ యాక్టర్ సందీప్ కిషన్ (Sundeep Kishan) కాంపౌండ్ నుంచి వస్తోన్న చిత్రం మజాకా (Mazaka). ధమాకా ఫేం త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నాడు. పెళ్లి చూపులు ఫేం రీతూ వర్మ హీరోయిన్గా నటిస్తుంది. రావు రమేశ్, మన్మథుడు ఫేం అన్షు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మాస్ ఎంటర్టైనర్గా వస్తోన్న ఈ చిత్రం ఫిబ్రవరి 21న విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉంది టీం. కాగా సందీప్ కిషన్ టీం తొలిసారి సరికొత్త ప్రయోగం చేస్తోంది. ఈ మూవీ నుంచి రావులమ్మ సాంగ్ లైవ్ ఫిల్మ్ షూట్ ఎలా ఉండబోతుందో తెలియజేసింది. సాంగ్ షూట్‌కు సంబంధించిన ఫుల్ వీడియోను షేర్ చేసింది. ఇండస్ట్రీలో తొలిసారి ఇలాంటి ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకొస్తూ.. సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది.
ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల చేసిన బ్యాచిలర్స్ ఆంథెమ్ సాంగ్‌తోపాటు మెలోడీ ట్రాక్ Love యే లైఫ్ అందామా? పాటలకు మంచి స్పందన వస్తోంది. మజాకా నుంచి ఇప్పటికే లాంచ్ చేసిన టైటిల్, ఫస్ట్ లుక్‌లో సందీప్ కిషన్ పంచె కట్టులో కనిపిస్తూ సందడి చేస్తున్నాడు. ఆర్కే బీచ్‌లో మందుకొడుతున్న ఇద్దరినీ స్టేషన్‌కు తీసుకొచ్చాం సార్.. హీరోహీరోయిన్లు స్టేషన్లో ఉన్న సీన్లతో మొదలైన టీజర్లో.. అక్కడ పోసుకున్నది బీరు కాదండి.. నా ఉసురు అని సందీప్ కిషన్ అంటుంటే.. నాకు తెలియక అడుగుతున్నాను బీర్ బెటరా.. విస్కీ బెటరా అని అడుగుతోంది రీతూవర్మ.
దీనికి రకుల్ బెటరా.. రెజీనా బెటరా అంటే ఏం చెప్తానండీ రీతూ వర్మ డైలాగ్స్ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. ఈ మూవీని ఏకే ఎంటర్ టైన్ మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
After a successful Live shoot streaming of #Ravulamma song, team #Mazaka poses with love and gratitude on the last day of their shoot 📸💥
Watch full Live Shoot here!
— https://t.co/CznESWIDzJ#SK30 #MazakaOnFeb26th pic.twitter.com/EtTqmBFuH3— BA Raju’s Team (@baraju_SuperHit) February 17, 2025
రావులమ్మ సాంగ్ లైవ్ ఫిల్మ్ షూట్..
BAFTA Film Awards: కాన్క్లేవ్ చిత్రానికి బాఫ్టా బెస్ట్ ఫిల్మ్ అవార్డు
Chhaava: విక్కీ కౌశల్ ఛావా కొత్త రికార్డు.. 3 రోజుల్లో 164 కోట్లు వసూల్