క్రీడారంగానికి ప్రభుత్వం పెద్ద పీట

84
క్రీడారంగానికి ప్రభుత్వం పెద్ద పీట

ఆదిలాబాద్‌ రూరల్‌, జూన్‌ 23: క్రీడా రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నదని ఆదిలాబాద్‌ మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌ అన్నారు. జిల్లా హ్యాండ్‌బాల్‌ సంఘం ఆధ్వర్యం లో పట్టణంలోని మాస్టర్‌ మైండ్స్‌ పాఠశాలలో బుధవారం ప్రపంచ హ్యాండ్‌బాల్‌ దినోత్సవం నిర్వహించారు. కేక్‌ కట్‌ చేసి క్రీడాకారులకు తినిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. హ్యాండ్‌బాల్‌ అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు. రెండేళ్లుగా జిల్లా క్రీడాకారులు హ్యాండ్‌బాల్‌లో రాణించడం అభినందనీయమన్నారు. స్టేడియంలో హ్యాండ్‌బాల్‌ కోర్టు ఏర్పాటుకు మున్సిపల్‌ నుంచి నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. వచ్చే ఏడాది పాఠశాలలకు హ్యాండ్‌బాల్‌లను పంపిణీ చేయడానికి ప్రణాళికలు రూపొందించామని అసోసియేషన్‌ అధ్యక్షుడు సాయిని రవికుమార్‌ తెలిపారు. అనంతరం పలు రాష్ట్ర , జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులకు కిట్లు అందజేశారు. అనంతరం మున్సిపల్‌ చైర్మన్‌ను సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బాలూరి గోవర్ధన్‌ రెడ్డి, కార్యదర్శి పార్థసారథి, జిల్లా హ్యాండ్‌బాల్‌ సంఘం కార్యదర్శి హరిచరణ్‌, సభ్యులు రాకేశ్‌, కొమ్ము కృష్ణ, అజయ్‌, జో, రాహుల్‌, రామ్‌కుమార్‌, ఆకాశ్‌ పాల్గొన్నారు.
క్రీడాకారులకు ఉజ్వల భవిష్యత్‌
రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో రాణించిన క్రీడాకారులకు ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందని ఒలింపిక్‌ సంఘం జిల్లా అధ్యక్షుడు బాలూరి గోవర్ధన్‌ రెడ్డి అన్నారు. ఒలంపిక్‌ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో క్రీడాజ్యోతి వెలిగించి ర్యాలీని ప్రారంభించారు. క్రీడల్లో రాణిస్తే ఉన్నత విద్య, ఉద్యోగాల్లో రెండు శాతం రిజర్వేషన్‌ పొందవచ్చన్నారు.అనంతరం కోచ్‌లు, సీనియర్‌ క్రీడాకారులను సన్మానించారు. డీవైఎస్‌వో వెంకటేశ్వర్లు, పెటా సంఘం జిల్లా అధ్యక్షుడు పార్థసారథి, హ్యాండ్‌బాల్‌ సంఘం జిల్లా కార్యదర్శి హరిచరణ్‌ తదితరులు పాల్గొన్నారు.
క్రీడాకారులకు సౌకర్యాలు
నిర్మల్‌ అర్బన్‌, జూన్‌ 23 : క్రీడాకారులకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నదని నిర్మల్‌ మున్సిపల్‌ చైర్మన్‌ గండ్రత్‌ ఈశ్వర్‌ అన్నారు. పట్టణంలోని ఎన్టీఆర్‌ మినీ స్టేడియంలో బుధవారం హ్యాండ్‌ బాల్‌ డే వేడుకలు నిర్వహించగా ఆయన మాట్లాడారు. మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి సహకారంతో పట్టణంలోని ఎన్టీఆర్‌ మినీ స్టేడియానికి కోట్లాది రూపాయలు వెచ్చించి అభివృద్ధి చేశారన్నారు.ఇండోర్‌ స్టేడియాన్ని సైతం అభివృద్ధి చేసి క్రీడాకారుల ఇబ్బందులను దూరం చేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ అధ్యక్షుడు అయ్యన్నగారి భూమయ్య, కార్యదర్శి పెంటన్న, ఉపాధ్యక్షులు శరత్‌, పెటా అధ్యక్షులు భుక్యా రమేశ్‌, భోజన్న, అంబాజీ, అన్నపూర్ణ, భూమన్న, డేవిడ్‌, గణేశ్‌, ప్రవళిక, లక్ష్మణ్‌, సుధాకర్‌, ముఖేశ్‌ పాల్గొన్నారు.