ఆదివారం 07 జూన్ 2020
Adilabad - Mar 31, 2020 , 02:57:04

ఎక్కడికక్కడ కట్టడి

ఎక్కడికక్కడ కట్టడి

నమస్తే తెలంగాణ యంత్రాంగం : ఆదిలాబాద్‌, నిర్మల్‌, కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల్లో లాక్‌డౌన్‌ పకడ్బందీగా అమలవుతున్నది. కామారెడ్డిలో సా మాజిక దూరం పాటిస్తూ నిత్యావసరాలు కొనుగోలు చేశారు. దోమకొండలోని గాంధీ చౌరస్తా వద్ద ఎస్సై రాజేశ్వర్‌గౌడ్‌ వాహనాల తనిఖీ చేపట్టారు. లింగంపేట మండలం లో 34 మంది క్వారంటైన్‌లో ఉన్నారని పీహెచ్‌సీ వైద్యుడు సాయికుమార్‌ తెలిపారు. హై దరాబాద్‌ నుంచి రాజస్థాన్‌ వెళ్లే వలస కూలీలకు రవా ణా సౌకర్యం కల్పిస్తామని ఏఎంవీఐ ఆనంద్‌ చెప్పా రు. నిత్యావసర వ స్తువులు డోర్‌ డెలివరీ చేయాలని ఎల్లారెడ్డి ఆర్డీవో దేవేందర్‌ రెడ్డి దుకాణదారులతో సమావేశం ఏర్పాటు చేసి సూచించారు. బాన్సువాడ మండలంలోని బోర్లం మైనార్టీ బాలికల గురుకులంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రాన్ని ఆర్డీ వో రాజేశ్వర్‌  పరిశీలించారు. నిజాంసాగర్‌, గాంధారిలో మండలాల్లో హోం క్వారంటైన్‌లో ఉన్న వారిని అధికారులు తనిఖీ చేశారు. సౌత్‌క్యాంపస్‌  బాలుర వసతి గృహంలోని ఐసోలేషన్‌లో రెవెన్యూ అధికారులు మరో 30 పడకలు ఏర్పాటు చేశారు. 

నిజామాబాద్‌ జిల్లాలో అంతా నిశ్శబ్దం..

నిజామాబాద్‌ జిల్లాలో లాక్‌డౌన్‌ పకడ్బందీగా అమలవుతు అంతా నిశ్శబ్దం అలుముకున్నది. ఏర్గట్ల మం డలంలో విదేశాలు, ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన వారికి తహసీల్దార్‌ యు.సురేశ్‌, మండల వైద్యాధికారులు అవగాహన కల్పించారు.  బోధన్‌ పట్టణంలో యూపీఎల్‌ కంపెనీవారు అందించిన యంత్రంతో స్ప్రేయింగ్‌ చేశారు. రెంజల్‌ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రాన్ని బోధన్‌ ఆర్డీవో గోపీరాం, ఏసీపీ జైపాల్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. వలస కూలీలకు సాయం అందించేందుకు దాతలు సహకరించాలని బోధన్‌ ఆర్డీవో కె.గోపీరాం కోరారు. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలను మాక్లూర్‌ ఎస్సై సాయినాథ్‌ పోలీసుస్టేషన్‌కు తరలించారు. రుద్రూర్‌ మండల కేంద్రంలోని రామాలయంలో కరోనా వైరస్‌ పూర్తిగా తొలగిపోవాలని గణపతి హోమం నిర్వహించారు. ముప్కాల్‌ మండల కేంద్రంలోని ఇటుకబట్టీ కార్మికులకు కరోనా వ్యాధిపై అవగాహన కల్పించారు. భీమ్‌గల్‌ ప ట్టణంలో లాక్‌డౌన్‌ నేపథ్యంలో తెరిచి ఉంచిన షాపులకు మున్సిపల్‌ కమిషనర్‌ గోపు గంగాధర్‌ రూ.వెయ్యి చొప్పున జరిమానా విధించారు. నిజామాబాద్‌ రూరల్‌, నందిపేట్‌, ఆర్మూర్‌, సిరికొండ, ఇందల్వాయి, ధర్పల్లి మండలాల్లో లాక్‌డౌన్‌ కొనసాగుతున్నది.

ఆదిలాబాద్‌లో కొనసాగిన లాక్‌డౌన్‌

ఆదిలాబాద్‌ జిల్లాలో లాక్‌డౌన్‌ కొనసాగుతున్నది. బోథ్‌, బేల మండలాల్లో ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు. డీడీసీ చైర్మన్‌ లోక భూమారెడ్డి తలమడుగు మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానను సందర్శించారు. విదేశాలు, ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన వారి వివరాలను మండల వైద్యాధికారిని అడిగి తెలుసుకున్నారు. ఉట్నూర్‌లో ఆర్డీవో వినోద్‌కుమార్‌, డీ ఎస్పీ ఉదయ్‌రెడ్డి లాక్‌డౌన్‌ను పర్యవేక్షించారు. ప్రజలు రోడ్లపైకి రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆదిలాబాద్‌ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ జనార్దన్‌ రాథోడ్‌ నార్నూర్‌లో పర్యటించారు. జిల్లా కేంద్రంలో 10 చోట్ల తాత్కాలిక కూరగాయల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేశామని అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి తెలిపారు. ఆదిలాబాద్‌ మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌ జిల్లా కేంద్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్‌ను పరిశీలించారు.

నిర్మల్‌లో రోడ్లు నిర్మానుష్యం

నిర్మల్‌ జిల్లాలో లాక్‌డౌన్‌ను పోలీసులు పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ప్రజలు అత్యవసర పనులకు తప్ప బయటకు రాకపోవడంతో బంద్‌ వా తావరణం నెలకొన్నది. పోలీసులు జాతీయ రహదారులపై బారికేడ్లను ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను నియంత్రించారు. ఖానాపూర్‌, దస్తురాబాద్‌ మండలాల్లో విదేశాల నుంచి వచ్చి హోం క్వారంటైన్‌లో ఉన్న వారిని ఆశ కార్యకర్తలు పరిశీలించారు. 


logo